తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోంది. కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసలో అసంతృప్తి నేతలు, పదవులు ఆశించి భంగపడిన నాయకులపై కన్నేసింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలపైనా దృష్టిసారించింది.
బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై మాజీ మంత్రి నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయకుల జాబితాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో బృందం సోమవారం నాడు ఢిల్లీకి చేరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈటల రాజేందర్ తో పాటు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఢిల్లీకి వెళ్లారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 2వ తేదీ నుండి ‘ప్రజా సంగ్రామ యాత్ర ’మూడో విడతను ప్రారంభించబోతున్న విషయం విదితమే. ఈ కారణంతోనే బండి సంజయ్ ఢిల్లీ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ జాాతీయ నాయకులతో జరిగే సమావేశానికి బండి సంజయ్ వర్చువల్ గా సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.