ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా శనివారం ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..ఎమ్మెల్సీ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా శనివారం ఆమె విచారణకు హాజరయ్యారు. అయితే లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడం, ఆమెను ఈడీ విచారణ చేయడం వంటి ఘటనలతో ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీపై , కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని.. తెలంగాణ పరువు తీశారని విమర్శించారు. తన బిడ్డను కాపాడుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.
ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్.. సీఎం కేసీఆర్, కవితలపై నిప్పులు చెలరేగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తొలిసారి ఏర్పడిన బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదన్నారు. రెండోసారి ఏర్పాటు అయిన బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కవిత లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి.. తెలంగాణ పరువు తీసిందని ఆయన అన్నారు.
ఆ విషయం నుంచి అందరి దృష్టి మరలించేందుకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నట్లు నాటకం ఆడుతున్నారని, బీఆర్ఎస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని ఎందుకు పోరాటం చేయలేదన్నారు. అలానే ఎంతమంది మహిళలకు కార్పొరేటర్ టికెట్లు, ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇంతకాలం గుర్తురాని మహిళల రిజర్వేషన్ విషయం.. ఈడీ నోటిసులు పంపినప్పుడే గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. తండ్రీ కూతుర్లు కలిసి వేల కోట్లు ఈ స్కామ్ ద్వారా దోచుకున్నారని బండి సంజయ్ అన్నారు.
Should Kavitha be kissed says BJP State President ….
Any comments @DrTamilisaiGuv @NCWIndia @umasudhir @tweet_aneri @swastikadas95 @TheNaveena @CoreenaSuares2 @SabithaindraTRS @smritiirani @nsitharaman pic.twitter.com/GLestoiIZQ
— Krishank (@Krishank_BRS) March 11, 2023
సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మరి.. బండి సంజయ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.