గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. చాలా గ్రామాలు నీట మునిగాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తెలంగాణలో భారీగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి చేరుతుంది. ప్రజలు భయటికి రావడానికి జంకుతున్నారు. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కూడా నీట మునిగిపోతున్నాయి. దాదాపు వారం రోజులుగా కురుస్తున్న వానలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలతో హైదరాబాద్‌లో కూడా చాలా కాలనీలు నీట మునిగాయి. మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అడవి ప్రాంతంలో 80 మంది పర్యాటకులు చిక్కుకుకు పోయారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. తరువాత ఏమైందో వివరాలు తెలుసుకుందాం..
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో ముత్యం దారా జలపాతాన్ని చూడడానికి బుధవారం 80 మంది పర్యాటకులు వెళ్లారు. జలపాతాన్ని సందర్శించిన తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో మామిడి గండి వాగు పొంగి పొర్లుతుంది. దీంతో పర్యాటకులు అడవిలోనే చిక్కుకు పోయారు. ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వారి సమాచారాన్ని 100 నెంబర్ కి డయల్ చేసి తెపిపారు. జిల్లా ఎస్పీ వెంటనే వారి కోసం బుధవారం సాయంత్రం నుండి పోలీసులు, జిల్లా డిజాస్టార్ రెస్పాన్స్ ఫోర్స్, ఏన్డీఆర్ఏఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 12 గంటలకు ఘటనా స్థలానికి ములుగు జిల్లా ఎస్పీ గౌష్ అలాం, ఏటూరునాగారం ఏఎస్పీ సీరిశెట్టి సంకీర్త్ చేరుకున్నారు.
రాత్రి 2 గంటలకు వారి ఆచూకీ తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో పర్యాటకులను ఒడ్డుకు చేర్చారు. కొందరు అనారోగ్యానికి గురైనవారికి వైద్యులు చికిత్స అందించారు. పర్యాటకులు ఖమ్మం, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ కు చెందిన వారుగా గుర్తించారు. పర్యాటకులను సేవ్ చేశారు. వారి స్వస్థలాలకు చేరేందుకు ఏర్పాట్లు చేశారు.
పర్యాటకులు తెలిపిన వివారాల ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో జలపాతం చూశారు. తిరిగి వస్తున్నపుడు సాయంత్రం 5 గంటల సమయంలో మామిడి గండి వాగు ఒక్కసారిగా పొంగింది. దీంతో అడవిలో సుమారు 10 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వేచి చూశామని తెలిపారు. ఈ సమయంలో ఒక వ్యక్తికి తేలు కుట్టిందని వారు తెలిపారు.