ఈ మధ్యకాలంలో వాట్సాప్ అంటే తెలియని వారు లేరు. ఎప్పటికప్పుడు వాట్సాప్ అనేది కొత్త కొత్త ఫీచర్స్ తో వినియోగదారులకు ది బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ అప్డేట్ అవుతూనే ఉంది. ఇదివరకే మల్టీ డివైజ్ కనెక్టింగ్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఆ ఫీచర్ ద్వారా ఒకే యూజర్ తన వాట్సప్ అకౌంటును ఒకేవేళలో నాలుగు వేర్వేరు డివైజ్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఒక డివైజ్‌లో చేసిన ఛాటింగ్ ఆటోమేటిక్ గా మరో డివైజ్‌లో సింక్ అయిపోతుంది.
మనం చేసే చాటింగ్, మెసేజెస్, పిక్స్ – వీడియోలు, కాల్స్ అన్నింటికీ ఎండ్ టు ఎంట్ ఎన్‌క్రిప్షన్ లభిస్తుంది. సాధారణంగా వాట్సప్‌ను వెబ్ వర్షన్ లేదా బ్రౌజర్‌లో ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్‌లలో ఇంటర్నెట్ కనెక్షన్ ఎల్లప్పుడూ యాక్టీవ్‌గా ఉండాలనే విషయం తెలిసిందే. కానీ వాట్సాప్ తీసుకురానున్న న్యూ ఫీచర్ ద్వారా మన స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా మిగతా డివైజ్‌లలో వాట్సాప్ వాడుకునే అవకాశం కల్పిస్తోంది.
ఆ ప్రాసెస్ ఏంటంటే..
– అన్నింటికీ ముందు మీ స్మార్ట్ ఫోన్‌లలో వాట్సప్ ఓపెన్ చేయండి.
– రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉండే త్రీ డాట్ ఐకాన్ క్లిక్ చేయండి.
– Linked devices పైన క్లిక్ చేయండి.
– ఆ తర్వాత Multi-device beta ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
– ఆ తర్వాత Join Beta పైన క్లిక్ చేయండి.
– ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.
– వాట్సప్ వెబ్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేయాలి.
ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు.
మెసేజెస్ మాత్రమే కాకుండా ఫైల్స్ కూడా షేర్ చేయొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు వాట్సప్ వెబ్ ద్వారా చేసిన మెసేజెస్ సింక్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా వాట్సప్ వెబ్‌లో వాట్సప్ యాక్టీవ్ గానే ఉంటుంది. అయితే మెయిన్ డివైజ్ 14 రోజులపాటు యాక్టీవ్ గా లేకపోతే మిగతా డివైజ్ లలో ఆటోమెటిక్‌గా వాట్సప్ లాగౌట్ అయిపోతుంది. ఈ ఫీచర్ వాడుకునే ముందు ఓ విషయం గుర్తుంచుకోవాలి.
మల్టీ డివైస్ ఫీచర్ యాక్టీవ్ లో ఉన్నప్పుడు ఛాట్స్ డిలిట్ చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుతం మల్టీ డివైజ్ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో సెట్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇదేగాక మరిన్ని ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సప్ స్టిక్కర్స్ ఫార్వర్డ్ చేసేందుకు కొత్త షార్ట్ కట్ రూపొందిస్తోంది వాట్సప్. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
బీటా యూజర్లకు టెస్టింగ్ పూర్తైన తర్వాత ఇతర యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తుంది. మీరు కూడా బీటా యూజర్ అయితే 2.21.24.11 వర్షన్ అప్డేట్ చేస్తే స్టిక్కర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక వాట్సాప్ లో మెసేజ్ డిసప్పియరింగ్ ఫీచర్ లో కొత్తగా టైమ్ లిమిట్ ను 90 రోజులకు పెంచబోతుందని సమాచారం. ఈ వాట్సాప్ న్యూ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.