ప్రపంచవ్యాప్తంగా పేరొందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలలో Vivo కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Vivo ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి న్యూ మోడల్స్ ప్రవేశపెడుతుంది. తాజాగా Vivo కంపెనీ 5G టెక్నాలజీ సపోర్ట్ చేయనున్న V23 స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది.
జనవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు Vivo.. V23 సిరీస్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేయనున్న సమయం కూడా సెట్ చేసింది. ఈ సిరీస్ లో Vivo V23, V23 Pro స్మార్ట్ ఫోన్లలను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే మార్కెట్ లో ఉన్న వివో ఫోన్లకంటే అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ V23 రాబోతున్నట్లు అందుబాటులోకి తీసుకురానుంది Vivo. అడ్వాన్స్ ఫీచర్లతో పాటు UV లైట్ లేదా సన్ లైట్ ఫోన్ వెనుక ప్యానెల్ భాగంలో పడినప్పుడు అది రంగులు మార్చనుందట. రంగులు మార్చే డిజైన్ కలిగిన మొదటి స్మార్ట్ ఫోన్ గా Vivo V23 ఇండియాలో పాపులర్ కాబోతుంది. మరి ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
తాజా సమాచారం ప్రకారం.. Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ తో రానుంది. దీని స్టోరేజీ విషయానికి వస్తే.. 8GB + 128GB మరియు 12GB +256GB రెండు స్థాయిలలో ఉంటుంది. ఆకర్షణీయమైన మెటల్ బాడీ కలిగిన V23 3D Curved (HDR 10+ కి సపోర్ట్ చేసే 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ AMOLED) డిస్ ప్లే తో వస్తుంది. సుమారు 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో పాటు 108MP కలిగిన బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెట్ అదనపు ఆకర్షణ అని చెప్పాలి.
ఈ Vivo V23 మోడల్ Android 12 వెర్షన్ ద్వారా FunTouch ఆపరేటింగ్ సిస్టమ్ తో ఆపరేట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4,300mAh బ్యాటరీ కెపాసిటీతో 44W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాలో వీటి ధరలు చూస్తే.. V23 మోడల్ రూ.31,990/- ఉండగా.. V23 Pro మోడల్ రూ.35,990/- ధరలతో అందుబాటులోకి రాబోతుంది. ఈ సిరీస్ Stardust Black – Sunshine Gold కలర్స్ లో లభించనుంది. మరి సంక్రాంతి కానుకగా వివో మొబైల్స్ ఈ సరికొత్త మోడల్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వివో సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.