మేడిన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా దేశీయ టెక్ కంపెనీ ‘సెన్స్’ మార్కెట్‌లోకి ఒకేసారి 7 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 32, 43, 50, 55, 65 ఇంచెస్ లో వీటిని లాంచ్ చేసింది. వీటిలో 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఈ టీవీలలో లుమినిసెన్స్, ఫ్లోరో సెన్స్ వంటి అధునాతన డిస్‌ప్లే ప్యానెల్‌లను అందించారు. తద్వారా ఈ టీవీలు థియేటర్ అనుభవాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఈ టీవీలను భారత్, అమెరికాకు చెందిన ఉద్యోగులు అభివృద్ధి చేశారు. అందువల్ల వీటికి పికాసో, డావెన్సీ వంటి ప్రసిద్ధ చిత్రకారుల పేర్లు పెట్టారు.
32 ఇంచెస్, 43 ఇంచెస్, 43 ఇంచెస్ 4కే, 50 ఇంచెస్ పికాసో 4కే, 55 ఇంచెస్ పికాసో 4కే, 55 ఇంచెస్ డావెన్సీ సిరీస్, 65 ఇంచెస్ డావెన్సీ సిరీస్.. ఇలా ఏడు మోడల్స్ లో వీటిని లాంచ్ చేసింది. వీటిలో 32 ఇంచెస్ హెచ్డీ టీవీ ధర రూ.9,999కాగా, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ ధర రూ.16,499, 43 ఇంచెస్ 4కే టీవీ ధర రూ.20,999గా ఉంది. ఇక 50 ఇంచెస్ పికాసో 4కే ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 24,999 కాగా, 55 ఇంచెస్ పికాసో 4కే ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 24,999గా ఉంది. ఇక డావెన్సీ సిరీస్ లో 55 ఇంచెస్ ధర రూ.33,999గా, 65 ఇంచెస్ ధర రూ.42,999గా ఉంది. ఈ సెన్స్ స్మార్ట్ టీవీలను ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.
సెన్స్ పికాసో స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్
50 ఇంచెస్, 55 ఇంచెస్ 4K డిస్‌ప్లే సెన్స్ పికాసో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీలు క్వాడ్-కోర్ A53 ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16జిబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5, 20 వాట్స్ స్పీకర్లు, HDMI పోర్ట్, USB పోర్ట్, ఆప్టికల్ పోర్ట్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లతో వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ యాప్స్ కూడా ఈ టీవీలకు సపోర్ట్ చేస్తాయి. వీటికి 20W ఆడియో అవుట్‌పుట్‌తో పాటు డాల్బీ ఆడియో ఇంకా DTS సపోర్ట్ ఉంది.
సెన్స్ డావెన్సీ సిరీస్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్
సెన్స్ డావెన్సీ సిరీస్ టీవీలు 178 డిగ్రీల వ్యూతో QLED డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ ప్లేతో 350 nits బ్రైట్‌నెస్, HDR10 అండ్ డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఉంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం Mali-G52 GPU TVతో ఇచ్చారు. టీవీతో 2జిబి ర్యామ్ 16 జిబి స్టోరేజ్ ఉంది. అలాగే ఈ స్మార్ట్ టీవీలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, HDMI పోర్ట్, USB పోర్ట్, ఈథర్‌నెట్ ఇంకా కనెక్టివిటీ కోసం ఆప్టికల్ పోర్ట్‌లు ఉన్నాయి. టీవీతో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఇంకా యూట్యూబ్ వంటి OTT యాప్స్ కూడా చూడవచ్చు. అలాగే, రిమోట్‌లో దీని కోసం ప్రత్యేక హాట్‌కీలు ఇచ్చారు.