స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ వాటా చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుండటమే ఇందుకు కారణం. త్వరలో శాంసంగ్ కొత్త మోడల్ Samsung Galalxy S26 లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుంది, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung నుంచి త్వరలో 6జి నెట్‌వర్క్‌తో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇదే Samsung Galaxy S26 Ultra. ఇండియాలో ఇంకా లాంచ్ కాని 6జి నెట్‌వర్క్ సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా అద్భుతమైన ఇతర ఫీచర్లు, హై ఎండ్ కెమేరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ఫుల్ బ్యాక్ ప్యానెల్ రీడిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఫ్లోటింగ్ లెన్స్ కెమేరా ఎలైన్‌మెంట్ కాకుండా సింగిల్ కెమేరా ఐలాండ్ లెన్స్‌లు ఉంటాయి. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 7కు సమానమైన ఫీచర్లతో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రోసెసర్‌తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శాంసంగ్ ఎస్ 25 కంటే ప్రత్యేకంగా ఉంటుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఇక కెమేరా అయితే హై ఎండ్ రిజల్యూషన్‌తో ఉంటుంది. క్వాడ్ రియల్ కెమేరా సెటప్‌లో 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ సెన్సార్, 200 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌తో పాటు మరో మూడు సెన్సార్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 12 మెగాపిక్సెల్ టెలీఫోటో షూటర్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 ధర ఎంత ఉంటుంది
త్వరలో ఇండియన్ మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా వంటి మోడల్స్ లాంచ్ కానున్నాయి. వచ్చే ఏడాది అంటే 2026 జనవరిలో లాంచ్ కావచ్చని అంచనా. ఇక ధర అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 1,59,990 రూపాయల నుంచి ప్రారంభం కావచ్చు.