శాంసంగ్ ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. శాంసంగ్ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఒకసారి ఈ డీల్స్ మిస్ అయితే మళ్లీ రావడం కష్టమే. ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
శాంసంగ్ ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా మూడు రకాల ఫోల్డబుల్ ఫోన్స్‌పై ఈ ఆఫర్ లభించనుంది. మీకు ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే కంపెనీ మళ్లీ ఇలాంటి డీల్ అందించకపోవచ్చు. కంపెనీ డిస్కౌంట్ అందిస్తున్న ఫోల్డబుల్ ఫోన్లలో Galaxy Z Fold, Galaxy Z Flip 7, Galaxy Z Flip 7FE ఫోన్లపై ప్రస్తుతం మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఫోల్టబుల్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు కంపెనీ అధికారిక ఇ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు ఉన్నాయి.
Samsung Galaxy Z Fold 7 లేదా Galaxy Z Flip 7 కొనుగోలు చేస్తే హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫుల్ పేమెంట్‌పై 12 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7ఎఫ్ఈపై 10 వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతో పాటు 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ వర్తిస్తుంది. ఇక పాత స్మార్ట్‌ఫోన్ ఇస్తే 12 వేల రూపాయలు అప్‌గ్రేడ్ బోనస్ ఉంటుంది. ఇది మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. క్రెడిట్ కార్డుతో నాన్ ఈఎంఐ తీసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రోసెసర్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తూ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ , 10 మెగాపిక్సెల్ టెలీపోటో లెన్స్, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇక గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 అయితే 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి. కెమేరా అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఇక గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ అయితే 8జీబీ ర్యామ్, ఎక్సినోస్ 2400 ప్రోసెసర్ , 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ధర 97,999 రూపాయలు కాగా, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ 85,999 రూపాయలకు లభించనుంది. ఇక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 అయితే 1,74,999 రూపాయలకు పొందవచ్చు. ప్రస్తుతం ఈ డిస్కౌంట్ ఆఫర్ కొద్దికాలానికే ఉంటుంది. కేవలం శాంసంగ్ అధికారిక ఇ సైట్‌లోనే లబిస్తుంది. అందుకే మీకు ఒకవేళ ఫోల్డబుల్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడండి.