రెడ్ మీ కంపెనీకి ఇండియాలో ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ వాళ్లు స్మార్ట్ ఫైర్ టీవీని లాంఛ్ చేశారు. తొలిసారి రెడ్ మీ కంపెనీ అమెజాన్ ఫైర్ ఓఎస్ తో పనిచేసే స్మార్ట్ టీవీని తయారు చేసింది. ఈ టీవీ ప్రత్యేకతలు, ధర, వివరాలు ఇలా ఉన్నాయి.
రెడ్ మీ కంపెనీకి ఇండియాలో ఎంత ఆదరణ ఉంది.. వారి ఉత్పత్తులకు ఎంత డిమాండ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. రెడ్ మీ కంపెనీకి ఇండియానే ప్రధాన, ముఖ్య మార్కెట్ కూడా. రెడ్ మీ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక సరికొత్త స్మార్ట్ ఫైర్ టీవీని రెడ్ మీ విడుదల చేసింది. ఈ టీవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా మెరెన్నో ఫీచర్స్, ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ అమెజాన్ ఫైర్ టీవీ ఎన్నో బ్రాండ్స్ స్మార్ట్ టీవీలకు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ టీవీ కొన్న వాళ్లకి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఫ్రీ అని చెబుతున్నారు.
రెడ్ మీ కంపెనీ నుంచి ఇప్పుడు భారత మార్కెట్ లోకి సరికొత్త టీవీ ఒకటి లాంఛ్ అయ్యింది. అదే రెడ్ మీ స్మార్ట్ ఫైర్ టీవీ. ఈ టీవీ ఫైర్ ఓస్ తో పనిచేస్తుంది. ఆమెజాన్ కు చెందిన ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తున్న తొలి రెడ్ మీ టీవీ ఇది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫైర్ టీవీ లుక్స్ ఎక్కువగా కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇది 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ మెటల్ బేజల్ లెస్ డిజైన్ తో వస్తోంది. ఫ్రేమ్ లెస్ గా ఉండి.. స్క్రీన్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇన్ బిల్ట్ ఫైర్ టీవీ కూడా ఉంటుంది. అలాగే రిమోట్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేసి.. సరికొత్త డిజైన్ తో విడుదల చేశారు.
ఇంక ఈ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ వీడియోలను మరింత అందంగా చూపిస్తుంది. ఈ ఫైర్ టీవీలో 20 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్- 8 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తోంది. ఈ టీవీ రిమోట్ లో అన్నీ కంట్రోల్స్ ఉంటాయి. ఇన్ బిల్ట్ అలెక్సా బటన్ కూడా ఉంటుంది. ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.13,999కాగా.. లాంఛింగ్ ఆఫర్ కింద రూ.11,999కే అందిస్తున్నారు. అమెజాన్ సబ్ స్క్రిప్షన్ లేని వాళ్లు ఈ టీవీ కొనుగోలు చేస్తే.. వన్ ఇయర్ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. ఇది పరిమితకాలం ఆఫర్ గా చెబుతున్నారు. మార్చి 21 నుంచి ఈ టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Say hello to a new era of entertainment. #RedmiSmartFireTV is smarter than ever with Dolby Audio, Amazon Alexa built-in, and a lot more.
Get your entertainment sorted on 21st March:https://t.co/xlsmYgEuWF pic.twitter.com/LBohEke0kD
— Redmi India (@RedmiIndia) March 14, 2023