టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చహల్ పోస్టు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా చాలా సరదాగా ఉండే చహల్ మంగళవారం ఒక సీరియస్ పోస్ట్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఎన్నడు లేనివిధంగా ఓ క్రియేటివ్ పిక్చర్‌ను షేర్ చేశాడు. దానిపై ‘న్యూ లైఫ్ లోడింగ్’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
దాంతో అతని భార్య ధనశ్రీ గర్భం దాల్చినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే చహల్ తండ్రికాబోతున్నాడంటూ అభినందనలు తెలుపుతున్నారు. కాగా రెండు రోజుల క్రితం చహల్ సోషల్ మీడియా వేదికగా బ్యాడ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. అతని సతీమణి ధను శ్రీ వర్మ విషయంలో కొందరు ఆకతాయిలు హద్దులు ధాటి కామెంట్లు చేశారు.
శ్రేయస్ అయ్యర్‌కు చహల్ భార్యతో ఎఫైర్ ఉందంటూ ఆరోపించడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని చహల్‌కు సూచనలు చేశారు. సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన పార్టీకి ధనశ్రీ చహల్‌తో కాకుండా శ్రేయస్‌తో హాజరవ్వడమే ఈ ట్రోలింగ్‌కు దారితీసింది. కానీ.. అవన్నీ వట్టి పుకార్లే అనే విషయం చహల్ పోస్టు స్పష్టమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.