భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాతో పాటు పలు జాతీయ వెబ్‌సైట్లలోనూ ఈ దంపతులపై కథనాలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతో పంజాబ్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. వీటికితోడు ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంటిపేరును తొలగించడం, కొత్త జీవితం లోడ్ అవుతోంది అంటూ ఇన్‌స్టా రీల్‌లో.. చాహల్ ఓ ఫొటోను పంచుకోవడంతో వీరి విడాకుల వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లైంది. తాజాగా ఈ వార్తలపై చాహల్ స్పందించాడు.
యూట్యూబ్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లాడాడు చాహాల్. అయితే, రెండేళ్లకే.. ఈ ఇద్దరికీ చెడిందనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరూ చేసిన పోస్టులే. చాహల్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అందులో “కొత్త జీవితం మొదలవుతోంది..” అని రాసి ఉంది. దీంతో ధనశ్రీ తల్లికాబోతుందేమో.. చాహల్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారంటూ అభిమానులు భావించారు. అయితే అదే సమయంలో చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో చాహల్ పేరును తొలగించడంతో గందరగోళం మొదలైంది.
చాహాల్‌ని పెళ్లాడిన తర్వాత ఇన్‌స్టాలో తన అకౌంట్ హ్యాండిల్ పేరు ‘ధనశ్రీ చాహాల్’ అని ఉండేది. ఆమె దాన్ని మళ్లీ ‘ధనశ్రీ వర్మ’గా మార్చింది. అదీకాకుండా దిగులుగా కూర్చున్న ఫోటోలను షేర్ చేసి.. ‘ప్రిన్సెస్ ఎప్పుడూ తన నొప్పిని, పవర్‌గా మార్చుకుంటుంది’ అంటూ కాప్షన్ ఇచ్చింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అన్న ప్రశ్నలు లేవనెత్తారు నెటిజన్స్. అందులోనూ ధనశ్రీ వర్మ నొప్పి అని పెట్టడంతో విడాకులు తీసుకోబోతున్నారనే అనుమానాలే ఎక్కువగా వ్యక్తం చేసారు. తాజాగా ఈ వదంతులపై చాహల్ స్పందించాడు. తమ రిలేషన్‌షిప్‌కి సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లు, వదంతులను నమ్మోద్దని సూచించాడు. దయచేసి ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయద్దని విజ్ఞప్తి చేశాడు.
డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేవాడు. ఆ పరిచయం ప్రేమగా మారి 2020 డిసెంబరులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన టీ20 మెగా టోర్నీలోనూ చాహల్ ఆడే మ్యాచ్ లకు దనశ్రీ వచ్చి గ్యాలరీ నుంచి ఉత్సాహపర్చింది. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేర్ చేసింది కూడా. ఇక, కెరీర్ పరంగా చాహల్ త్వరలోనే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడనున్నాడు. ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL vs PSL: పాకిస్థాన్ కొంపముంచిన ICC! ఇరకాటంలో పాకిస్థాన్ బోర్డు!
ఇదీ చదవండి: BCCI Test: అంపైర్లకు పరీక్ష పెట్టిన బీసీసీఐ.. 140 మందిలో ముగ్గురే పాస్..!