2011 వరకు యువరాజ్ సింగ్ జట్టులో కీలక ప్లేయర్. మెరుపు బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ వేస్తూ వికెట్లు తీసేవాడు. వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన యువీ.. తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి కోహ్లీనే కారణమని చెప్పుకొచ్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలకాలంగా భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ లో కీలక ప్లేయర్ గా నిలిచాడు. అండర్ 19 ప్రపంచ కప్ విజేతగా టీమిండియాలోకి అడుగు పెట్టిన యువరాజ్ సింగ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దూకుడే మంత్రంగా యువి బ్యాటింగ్ కొనసాగేది. జిడ్డు బ్యాటింగ్ తో ఆడియన్స్ కి విసుగు పుట్టించే ఆ రోజుల్లో యువరాజ్ బౌండరీల వర్షం కురిపించేవాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సిక్సర్ల కింగ్ గా పేరు గాంచాడు. అయితే అంతా సవ్యంగా సాగిపోతున్న యువరాజ్ జీవితంలో క్యాన్సర్ ఊహించని విధంగా ఈ స్టార్ ఆటగాడి కెరీర్ ని వెనక్కి నెట్టింది. అయినా సరే క్యాన్సర్ ని సైతం జయించి టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఇక వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన యువీ.. తిరిగి కంబ్యాక్ ఇవ్వడానికి కోహ్లీనే కారణమని చెప్పుకొచ్చాడు.
2011 వరకు యువరాజ్ సింగ్ జట్టులో కీలక ప్లేయర్. మెరుపు బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ వేస్తూ వికెట్లు తీసేవాడు. అప్పటివరకు బ్యాటింగ్ ఆల్ రౌండర్ కొనసాగిన యువీ.. 2011 వరల్డ్ కప్ లో పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ గా మారాడు. అదే ఊపులో వన్డే వరల్డ్ కప్ తీసుకొని రావడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతే కాదు 2007 టీ 20 ప్రపంచ కప్ రావడానికి కూడా యువరాజ్ దే కీ రోల్. అయితే 2012 నుంచి యువరాజ్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. సెలెక్టర్లు కూడా అతనికి మొండి చేయి చూపించారు. ఈ నేపథ్యంలో చాలా కాలం పాటు జట్టుకి దూరంగానే ఉన్నాడు. ఇక 2015 వన్డే వరల్డ్ కప్ లో యువీని సెలెక్ట్ చేయకపోవడంతో పెద్ద చర్చే నడిచింది.అదే సమయంలో కోహ్లీ, రహానే, రైనా లాంటి ప్లేయర్లు రాణించడంతో యువరాజ్ కెరీర్ ముగిసిందనుకున్నారంతా. అయితే 2017 లో మరోసారి జట్టులోకి పునరాగమనం చేసాడు.
2017 సమయంలో విరాట్ కోహ్లీ భారత కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. యువరాజ్ జట్టులోకి రావడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో సహాయం చేసాడని యువి తాజాగా చెప్పుకొచ్చాడు. యువరాజ్ మాట్లాడుతూ.. “పునరాగమనంలో కోహ్లీ నాకు ఎంతో అండగా నిలిచాడు. ఒకవేళ కోహ్లీ సహకారం గనుక లేకపోతే.. నేను మరోసారి టీంఇండియాలో కనిపించేవాడిని కాదు. అదే సమయంలో ధోని నాకు వాస్తవాలేంటో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు. 2019 వరల్డ్ కప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు నా పేరు పరిశీలించడం లేదని ధోని నాకు తెలియజేశాడు. కానీ నేను అప్పుడు ఎవ్వరి మీద వేలెత్తి చూపాలని అనుకోలేదు. కెప్టెన్ గా ఎవరైనా కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అని ఈ సందర్భంగా యువరాజ్ తెలియజేశాడు. మరి ఇన్నేళ్ల తర్వాత యువరాజ్ సింగ్ చేసిన కామెంట్లు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.