మనిషి ప్రాణాలు ఏ క్షణంలో ఎలా పోతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో ఎంతో ఆనందంగా గడిపిన వారు హఠాత్తుగా కన్నుమూయడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేరు. ఈ మద్య చిన్న వయసులోనే గుండెపోటు, కరెంట్ షాక్, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల చిన్నవయసులోనే కొంతమంది మరణిస్తున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు అనుకోని ప్రమాదాల్లో చనిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తాజాగా మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం 13 ఏండ్ల వయసులోనే యువ రైడర్ ప్రమాదంలో మరణించాడు. ఈ విషాద ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చెన్నై వేదికగా ఎమ్‌ఆర్‌ఎఫ్ ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. మోటార్‌సైకిల్ రేసింగ్ లో యువ రైడర్ కొప్పారం శ్రియాస్ (13) పాల్గొన్నాడు. అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ.. పోటీకి సిద్దమయ్యాడు. రేసింగ్ లో భాగంగా బరిలోకి దిగిన శ్రియాస్ హరీశ్ మూడో రౌండ్ లో అనుకోకుండా ప్రమాదానికి గురై పల్టీలు కొట్టుకుంటో దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో శ్రియాస్ హరీశ్ కి తీవ్రంగా గాయాలు అయ్యాయి. హాస్పిటల్ కి తరలించేలోగా డాక్టర్లు అప్పటికే ప్రాణాలు పోయినట్లు నిర్ధారించారు.
కేవలం 13 ఏండ్ల వయసులోనే శ్రియాస్ హరీశ్ సహ క్రీడాకారులు, నిర్వాహకులు విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న హరీష్ ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం అందరినీ కలచివేసింది. శ్రియాస్ హరీశ్ మరణించడంతో నిర్వాహకులు మిగతా అన్ని రేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండే తమ కుమారుడు రేసింగ్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుంటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. పలువురు క్రీడాకారులు శ్రియాస్ కి నివాళులర్పించారు.