డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించే దిశగా కనిపిస్తుంది. రెండో రోజు కూడా ఇదే రిపీట్ అయితే ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. అయినా కానీ క్రికెట్ ఫ్యాన్స్ పాత రికార్డు ఒకటి గుర్తు చేసుకుంటూ సంబరపడిపోతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి రోజు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లను 327 పరుగుల భారీ స్కోర్ చేసింది. 100 పరుగులు చేయకుండానే మూడు కీలక వికెట్లు కోల్పోయిన కష్టాల్లో నిలిచినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెడ్, టాప్ బ్యాటర్ స్మిత్ భారీ భాగస్వామ్యంతో పట్టు బిగించే దిశగా కనిపిస్తుంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడం.. స్మిత్, హెడ్ గ్రీజ్ లో పాతుకుపోవడంతో ఈ మ్యాచులో భారత్ గెలవడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. దీంతో కనీసం ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా.. బాగుండు అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సెంటిమెంట్ మాత్రం భారత్ ని ఊరిస్తుంది.
సెంటిమెంట్ మ్యాచ్ వినడానికి బాగానే ఉన్నా.. మ్యాచ్ గెలవడానికి ఏ మాత్రం సరిపోవు. అయినా కానీ క్రికెట్ ఫ్యాన్స్ పాత రికార్డు ఒకటి గుర్తు చేసుకుంటూ సంబరపడిపోతున్నారు. 2001లో చెన్నై వేదికగా భారత్ ఆస్ట్రేలియాతో మధ్య జరిగిన టెస్టులో తొలి రోజు ముగిసేసరికి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదరైంది. అప్పుడు కూడా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రోజు ఆట ముగిసే సమయానికి 326/3తో నిలిచింది. కానీ రెండో రోజు భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 391 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 501 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 264 పరుగులకే ఆలౌట్ అయ్యింది. చివరి ఇన్నింగ్స్‌లో 155/8తో నిలిచిన టీమిండియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలని సారంగ్ భలేరావ్ అనే క్రికెట్ అనలిస్ట్ ట్వీట్ చేశాడు.
భారత పిచ్ ల మీద ఇలాంటివి జరగడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. ఇంగ్లాండ్ లో మాత్రం ఇలాంటివి ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో భారత్ కంటే ఆస్ట్రేలియా కి ఎక్కువ అవగాహన ఉంది. ఒకవేళ నిజంగా చెన్నై టెస్టు ఫలితం రిపీట్ అయితే మాత్రం అది టీమిండియాకి అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ దశలో భారత్ గెలవాలంటే బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా రాణించాలి. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరి సెంటిమెంట్ రిపీట్ భారత్ కి ఏ మాత్రం కలిసొస్తుందో తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.