జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓడింది. దీంతో తొలిసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే భారత్ ఆశలను మరింత కఠినతరం చేసింది. సిరీస్ విజయవకాశాలు ఎలా ఉన్నా.. మరో బిగ్ ఈవెంట్‌పై ఈ ఓటమి ప్రభావం పడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ముందుకు వెళ్లకుండా ఈ ఓటమి అడ్డుపడింది. దీంతో టీమ్ ఇండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడం ప్రస్తుతం కొంచెం కష్టంగా కనిపిస్తోంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 36 పాయింట్లతో 100 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉంది. 24 పాయింట్లతో శ్రీలంక కూడా 100 శాతం విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో మన దాయాది పాకిస్తాన్ 36 పాయింట్లు, 75శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో టీమిండియా ఉంది. 55.21 శాతం విజయాలతో 53 పాయింట్లతో ఉంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో సిరీస్‌ను ఆడుతున్న భారత్ 4 విజయాలు, 2 ఓటములు, 2 డ్రాలను సాధించింది. గెలుపు శాతం 55.21 నుంచి తగ్గింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత, స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ ఇండియా 3 పాయింట్ల భారాన్ని చవిచూసింది. దీని కారణంగా పాయింట్లు కూడా 53కి పడిపోయాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో టాప్ టూ ఉన్న జట్లు తలపడతాయి. ఎన్ని పాయింట్లు ఉన్నాయన్న దానికంటే విజయశాతంపైనే ఫైనలిస్టుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతం భారత్ అన్ని జట్లు కంటే అత్యధికంగా 53 పాయింట్లు కలిగాఉన్నా కూడా.. విజయశాతాన్నిమెరుగుపర్చుకోవాలి. దీని కోసం, ఇప్పుడు రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలిచితీరాలి. భారత్‌కు మరో 3 మ్యాచ్‌లు ఉన్నాయి.
ఈ 3 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగే మ్యాచ్ కూడా ఒకటి. మిగిలిన 2 మ్యాచ్‌లు శ్రీలంకతో స్వదేశంలో జరుగుతాయి. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని, ఆపై శ్రీలంకను తన సొంత గడ్డపై క్లియర్ చేస్తే.. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడొచ్చు. ఇప్పటికే జరిగిన తొలి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. మరి భారత్ రెండో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుతుందని మీ భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The #WTC23 standings after South Africa’s historic win over India 👀 pic.twitter.com/4OFegawy7F
— ICC (@ICC) January 6, 2022