క్రికెట్.. ఈ మూడు అక్షరాలకి ఇండియాలో ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు! అదో మతం, అదో ఉత్పేరకం, అదో ఉన్మాదం. క్రికెటర్స్ అంటే ఇక దేవుళ్ళే. కేవలం 11 మంది బరిలోకి దిగుతుంటే.. 139 కోట్ల మంది వాళ్ళకు మద్దతుగా నిలిచి.. కమాన్ ఇండియా అని గుండెలు పగిలేలా అరుస్తూ ఉంటారు. ప్రజల దృష్టిలో టీమిండియా అంటే ఒక దేశం. టీమిండియా గెలుపు అంటే తమ దేశపు గెలుపు. టీమిండియా ఓటమి అంటే తమ దేశపు ఓటమి. “స్కూల్‌కు డుమ్మా కొట్టి మ్యాచ్‌లు చూడటం, ఆఫీస్ లకి సెలవు పెట్ట టీవీలకి అతుక్కొని పోవడం, టీమ్ గెలిస్తే వేలు ఖర్చు పెట్టి స్వీట్స్ పంచడం, ఆఖరికి మ్యాచ్ చూస్తూ చూస్తూ టెన్షన్ తట్టుకోలేక గుండె ఆగి చనిపోవడం” వీటన్నంటిని కేవలం ఎంటర్టైన్మెంట్‌గా మాత్రమే ఎలా చూడగలం. భారతీయులకి క్రికెట్ అంటే వినోదం మాత్రమే కాదు. అంతకు మించి ఓ పవిత్రమైన ఆరాధన కూడా. మరి.. ఈ ఆట పట్ల ఇప్పటి టీమిండియా ఆటగాళ్లు కూడా ఇంతే కమిట్మెంట్ తో ఉన్నారా? ఇప్పుడు చర్చ జరగాల్సింది ఈ విషయం మీదే.
అవసరాలు తీర్చడానికి స్టాఫ్, కోరింది లేదు అని చెప్పకుండా ఆరెంజ్ చేసే బోర్డు, అన్నీ వేళల అండగా నిలబడే సపోర్టింగ్ టీమ్, వద్దు అన్న వచ్చి పడే కోట్ల కొద్దీ డబ్బు, విమానాలలో ప్రయాణం, స్టార్ హోటల్స్ లో లగ్జరీ లైఫ్ స్టైల్, ఏడాదికి ఒకసారి కాసులు కురిపించే ఐపీఎల్, గాయపడితే నేషనల్ అకాడమీలో కేరింగ్.. ఇలా ఇప్పటి తరం కుర్రాళ్ళకి అన్నీ సదుపాయాలు ఉన్నాయి. కానీ.., వారిలో లోపించిందల్లా.. మనం క్రికెట్ ఆడుతుంది దేశం తరువున అనే కమిట్మెంట్! 1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ కి.. అప్పటి బోర్డు చేతి ఖర్చులకి కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వలేకపోయిందని మీకు తెలుసా? అయినా.. వాళ్ళు అద్భుతం చేశారు. దేశం తల ఎత్తుకునేలా చేశారు. ఆ “కపిల్ డెవిల్స్” లో ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు ఉన్న కుర్రాళ్లలో ఎందుకు కనిపించడం లేదు?
ఊహించనంత అంత డబ్బు వచ్చి పడుతున్నా, లెక్కకి మించి ఆపరేషన్స్ తో ఒళ్ళు గుల్ల అవుతున్నా, అందరూ దేవుడు అంటూ కీర్తిస్తున్నా, ఒంటి మీద పూల వర్షం కురిపించినా, ఇంటి మీద రాళ్ళ దాడి చేసినా.. ఇలా మంచి అయినా, చెడు అయినా క్రికెట్ ని మాత్రమే ప్రేమించి, శ్వాసించి, దేవుడిగా ఎదిగిన సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి ఇప్పటి క్రికెటర్స్ లో ఎందకు కనిపించడం లేదు? మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇండియన్ క్రికెట్ కీర్తి మసకబారినప్పుడు, సరైన కెప్టెన్ లేక టీమ్ పరిస్థితి అధ్వానంగా మారిన వేళ గంగూలీ అనే ఒక నూనూగు మీసాల కుర్రాడు ముందుకి వచ్చాడు. మొత్తం దేశాన్ని మళ్ళీ క్రికెట్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. మళ్ళీ అందరూ క్రికెట్ చూసేలా చేశాడు. దాదాలోని ఆ కసి, పట్టుదల ఇప్పుడు కురాళ్లలో ఎందుకు కనిపించడం లేదు? ప్రత్యర్థి ఎంత పెద్దదైనా, బౌలర్ ఎవ్వడైనా, పిచ్ ఎలాంటిదైనా.. టీమ్ అంతా కుప్పకూలి పోతుంటే.. ఒక్కడు మాత్రం చెమటలు కక్కుతూ, ఆయాస పడుతూ అలాగే క్రీజ్‌లో అడ్డుగోడలా నిలబడి పోయేవాడు. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ రాహుల్ ద్రవిడ్ లోని ఓర్పు, సహనం ఇప్పటి జనరేషన్ లో ఎవరిలో చూడగలము?
అంతటి లాంగ్ జర్నీ చేసే ఓపిక ఇప్పటి యువతరానికి లేదు. అంతటి కష్టం కూడా వారికి అవసరం లేదు. ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడితే చాలు. టీమిండియాలో స్థానం ఖాయం. కోట్ల కొద్దీ డబ్బు. ఇక్కడ అందరూ స్టార్లే. అందరూ తమని తాము ఎక్కువగా ఉహించుకోవడమే. తమదైన రోజున మెరుపులు మెరిపించడం, వారిది కాని రోజున అందరూ ఒకేసారి చేతులు ఎత్తేయడం. గత కొన్నేళ్లుగా టీమిండియా పెద్ద టోర్నీలు సాధించలేకపోవడానికి కారణం ఇదే. మ్యాచ్ ఓడిపోతున్నామనే బాధ ఒక్కరిలో కనిపించడం లేదు. ఓడిపోయాక దిగులు కనిపించడం లేదు. వారి దృష్టిలో క్రికెట్ అంటే.. కోట్ల రూపాయలు శాలరీ ఇచ్చే జాబ్ మాత్రమే. ఈ ఆలోచన విధానం మారనంత వరకు మళ్ళీ పెద్ద టోర్నీలను సాధించడం దాదాపు అసాధ్యమే.
Airplane is coming! Are you ready team India. Mumbai Airport is waiting 😂#INDvsSL#Goodbye pic.twitter.com/CeVwpWTJd3
— waqarbaloch786 (@waqaralijatoi11) September 6, 2022
Richest BOARD 🌍@BCCI & @IPL CALM DOWN
YOU ARE NOT THE GOD!!!#bcci#BANIPL#BoycottIPL#INDvSL #RishabhPant#Bhuvi#SackRohit#INDvsSLMissing #DHONI mahi ❣️
T20 WC
Team India world Cup 🥲My reaction after today’s TEAM INDIA’S Performance in #IndiavsSrilanka #AsiaCupT20 # pic.twitter.com/3lGtiWOMgF
— Chirag Rajvaniya (@mr_rajvaniya) September 6, 2022
Rohit Sharma offered a free invitation into the dressing room to see the mood in the camp 👀 #AsiaCup2022
— ESPNcricinfo (@ESPNcricinfo) September 7, 2022
ఇది కూడా చదవండి: అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన కేఎల్ రాహుల్! ఏం అంపైరింగ్ అంటూ..