కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1లో కెంట్ తో జరిగిన మ్యాచ్ లో లంకషైర్ 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే 5 వికెట్ల ప్రదర్శన చేసిన సుందర్.. ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 3 వికెట్లతో మెరిశాడు.
అంతేకాకుండా.. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓ బంతికి జోర్డాన్ కాక్స్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి వికెట్లు గిరాటేసిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుందర్ వేసిన ఆఫ్ స్పిన్నర్ ను జోర్డాన్ డిఫెండ్ చేయాలని చూశాడు. అది కాస్తా బ్యాట్- ప్యాడ్ల గ్యాప్ లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. అసలు ఎలా బౌల్డ్ అయ్యాడో తెలియక జోర్డాన్ కాక్స్ కాసేపు అలాగే ఉండిపోయాడు.
జోర్డాన్ అలా షాకవ్వడమే కాదు.. వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఆ బాల్ గుగ్లీనా? ఆఫ్ స్పిన్నర్ అనుకున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కౌంటీ ఛాంపియన్‌షిప్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానికి ‘సుందర్ నుంచి నమ్మశక్యంకాని డెలివరీ’ అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That is an incredible delivery from @Sundarwashi5 😲#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l
— LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022