కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1లో కెంట్ తో జరిగిన మ్యాచ్ లో లంకషైర్ 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే 5 వికెట్ల ప్రదర్శన చేసిన సుందర్.. ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 3 వికెట్లతో మెరిశాడు. అంతేకాకుండా.. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓ బంతికి జోర్డాన్ కాక్స్ బౌల్డ్ అయ్యాడు. […]