టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే 71 సెంచరీలతో ఉన్నాడు. కానీ కొన్ని రోజులుగా విరాట్ సరైన ఫామ్‌లో లేడు. ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో బుధవారం జరుగుతున్న రెండో వన్డేలో కూడా తక్కువ స్కోర్‌కే అవుట్ అయ్యాడు. స్మిత్ బౌలింగ్‌లో హోప్‌కు క్యాచ్ ఇచ్చి ఫెవిలియన్ చేరాడు. 30 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.
కాగా ఈ వన్డే విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకం. ఈ వన్డేతో స్వదేశంలో 100 వన్డేల మైలురాయిని చేరుకున్నాడు కోహ్లీ. అలాంటి మ్యాచ్‌లో కూడా కోహ్లీ నిరాశపర్చడంతో అతని ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశ చెందారు. కాగా తన జెర్సీ నంబర్ 18నే ఈ మ్యాచ్‌లో చేసిన కోహ్లీపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ కోహ్లీ టాలెంట్‌ను రెండు మూడు ఇన్నింగ్స్ ఫెల్యూర్లతో తక్కువ చేయలేమని మరికొంత మంది కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరి కోహ్లీ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.