ఆసియా కప్ 2022 సూపర్-4లో భాగంగా భారత్, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలుపొందింది. మొన్న పాకిస్తాన్ తో, నిన్న శ్రీలంకతో ఓడిపోవడం వల్ల ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన కేఎల్ రాహుల్ 6 పరుగులకే పెవిలియన్ కి చేరుకోగా.. మరొక ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 72 పరుగులు చేసి టాప్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక తర్వాత దిగిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 34, హార్దిక్ పాండ్యా 17, రిషబ్ పంత్ 17, దీపక్ హూడా 3, రవిచంద్రన్ అశ్విన్ 15, అర్ష్ డీప్ సింగ్ 1 పరుగులతో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. అయితే శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి భారత్ పై విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ లో చాహల్ ను విరాట్ కోహ్లీ ముద్దు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు ముఖ్యంగా పేసర్లు సరిగా రాణించలేకపోయినప్పటికీ.. తీసిన శ్రీలంక వికెట్లతో నాలుగు వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఇందులో మూడు వికెట్లు చాహల్ తీసినవే. శ్రీలంక ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన చాహల్.. వరుసగా నిసంకా(52), అసలంక(0)లను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత 15వ ఓవర్ లో కుశాల్ మెండిస్(57)ను ఎల్బీతో అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. ఆప్యాయంగా చాహల్ నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి విరాట్ కోహ్లీ.. చాహల్ ను ముద్దు
#ViratKohli kisses #YuzvendraChahal #INDvsSL pic.twitter.com/5XHuQjfHCf
— Cricket fan (@Cricket58214082) September 6, 2022