సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అలాంటి సంఘటనలు మ్యాచ్ అనంతరం వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, క్రికెటర్లపై తమ ప్రేమను ఫ్లకార్డులపై రాసి వ్యక్తం చేసిన సంఘటనలు కూడా మనం చాలానే చూశాం. అయితే గత ఆసియా కప్ లో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఓ ఫ్లకార్డు దర్శనమించింది. ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ ఆడుతుండగా.. విరాట్ కోహ్లీ వీరాభిమాని ఒకరు కోహ్లీ 71వ సెంచరీ కొట్టే దాక నేను పెళ్లి చేసుకోను అని ఫ్లకార్డుపై రాసి ప్రదర్శించాడు. అప్పట్లో ఇది వైరల్ గా మారింది. పాపం అతడి బాధను అర్థం చేసుకున్నట్లు ఉన్నాడు విరాట్.. వెంటనే సెంచరీల మీద సెంచరీలు బాదేశాడు. దాంతో ప్రస్తుతం అతడు తన మాట ప్రకారంమే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం పెళ్లికుమారుడి గెటప్ లో ఉన్న ఆ అభిమాని ఫోటోలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గానే కాకుండా వరల్డ్ వైడ్ గా దిగ్గజ బ్యాటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించాడు. దాంతో అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే గత ఆసియా కప్ లో భారత్ మ్యాచ్ ఆడుతుంటే అమన్ అగర్వాల్ అనే అభిమాని.. కోహ్లీ 71 సెంచరీలు కొట్టే దాక నేను పెళ్లి చేసుకోను అని ఫ్లకార్డుపై రాసి ప్రదర్శించాడు. అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే అతడి బాధను అర్థం చేసుకున్నాడో ఏమో గానీ.. కోహ్లీ కొద్ది రోజుల్లోనే సెంచరీల మీద సెంచరీలు కొట్టేశాడు. మూడు సంవత్సరాల నుంచి సెంచరీ కోసం తహతహలాడుతున్న కోహ్లీ.. తన శతక దాహాన్ని ఆఫ్ఘనిస్తాన్ పై తీర్చుకున్నాడు.
ఇక కోహ్లీ సెంచరీ చేయడంతో తన శపథాన్ని వీడాడు అమన్ అగర్వాల్. తన పెళ్లి పనులు మెుదలు పెట్టాడు.. అయితే అతడి పెళ్లి నాటికి మరో మూడు సెంచరీలు బాది మెుత్తం 74 శతకాలు నమోదు చేశాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు ఈ అభిమాని. ”నేను 71వ సెంచరీని అడిగితే.. నా పెళ్లిరోజు నాటికి 74 సెంచరీలతో నాకు ప్రత్యేక గిఫ్ట్ ను ఇచ్చాడు విరాట్ ” అంటూ పిక్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. కోహ్లీకి అభిమానులు ఉండరు.. వీరాభిమానులే ఉంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
“I asked for the 71st century but he scored 74th on my special day” ❤️❤️❤️@imVkohli @AnushkaSharma @StayWrogn pic.twitter.com/zHopZmzKdH
— Aman Agarwal (@Aman2010Aman) January 16, 2023