శ్రీలంకపై టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే గౌహతి వేదికగా.. నేడు(మంగళవారం) మధ్యాహ్నం మొదలవనుంది. అయితే.. ఈ మ్యాచ్‌తో భారత జట్టులోకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి రానున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యంగ్ టీమిండియాపైనే టీ20 సిరీస్ గెలవలేకపోయిన లంక.. ఈ హేమాహేమీల కూడిన సీనియర్ టీమ్‌ను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. ఇక ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు ఒక విషయం కలవరపరుస్తోంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గత రికార్డే వారి భయానికి కారణం.
తొలి వన్డే జరిగే గౌహతిలో భారత్-వెస్టిండీస్ మధ్య 2018లో ఒక వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 322 పరుగుల భారీ స్కోర్ చేసింది. షిమ్రోన్ హెట్‌మేయర్(106) సెంచరీతో చెలరేగగా.. విండీస్ భారీ టార్గెట్‌ను టీమిండియా ముందు ఉంచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా.. సంచలన విజయం నమోదు చేసింది. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ధావన్ 4 పరుగులు చేసి త్వరగానే అవుటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. రోహిత్‌తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ ఇద్దరూ కలిసి విండీస్ బౌలర్లతో చెడుగుడు ఆడుకున్నారు. బౌండరీల వర్షం కురిపించిన ఈ జోడీ.. రెండో వికెట్‌కు 246 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సులతో 140 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు.
ఇక మిగిలిన ఆ కొద్ది టార్గెట్‌ను అంబటి రాయుడితో కలిసి.. రోహిత్ శర్మ పూర్తి చేశాడు. 117 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సులతో రోహిత్ 152 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. అలాగే అంబటి రాయుడు 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీ విధ్వంసం సృష్టించడంతో భారత్.. 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే.. మళ్లీ ఇదే గౌహతి గ్రౌండ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ గ్రౌండ్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో ఇద్దరూ సెంచరీతో చెలరేగారు. ఇప్పుడు అదే ఫీట్ ఈ ఇద్దరూ ఎక్కడ రిపీట్ చేస్తారో అని లంక బౌలర్లు భయపడుతున్నారు. వారిద్దరికి కళ్లెం వేసేందుకు పక్కా ప్రణాళికలతో బరిలో దిగనున్నారు. మరి రోహిత్, కోహ్లీ.. చివరి సారిగా గౌహతిలో ఆడినప్పుడు సెంచరీలో కదం తొక్కారు. మళ్లీ ఈ మ్యాచ్‌లోనూ ఆ ఫామ్‌ను కొనసాగిస్తారా? తమకు అచ్చొచ్చిన మైదానంలో చెలరేగిపోతారా? ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli & Rohit Sharma scored hundreds when India played an ODI last time in Guwahati.
— Johns. (@CricCrazyJohns) January 10, 2023