కేఎల్ రాహుల్ ఫామ్ గురించి ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ గొడవలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తల దూర్చాడు.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫేలవ ఫామ్‌లో ఉన్నాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. యువ క్రికెటర్‌గా సంచలన బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టారడమ్‌ను సంపాదించుకున్నాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భవిష్యత్తు కెప్టెన్‌గా కనిపించాడు. కానీ.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ వైస్ కెప్టెన్సీని పొగొట్టుకున్నాడు. ప్రస్తుతం జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా మిగిలాడు. అయినా కూడా అతనికి అవకాశాలు ఇస్తున్నారంటూ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి, రాహుల్‌ను ఆడిస్తుండటం, అతను వరుసగా విఫలం అవుతుండటంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్ల మధ్య గొడవ మొదలైంది. భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్, రాహుల్ ఫేలవ ఫామ్‌ను ఎత్తిచూపుతుంటే, మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా, ప్రసాద్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలోని ట్విట్టర్, య్యూట్యూబ్‌లో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 8 ఏళ్లుగా టీమ్‌లో ఉంటూ ఇలాంటి ఫామ్ ఏంటని వెంకటేశ్ ప్రసాద్, కేఎల్ రాహల్‌పై విమర్శలు గుప్పించగా.. దానికి ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయి ప్రసాద్ తన వ్యక్తిగత అజెండాతోనే రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో వెంకటేశ్ ప్రసాద్‌కు చిర్రెత్తుకొచ్చి గతంలో ఆకాశ్ చోప్రా.. రోహిత్ శర్మ ఫామ్‌పై చేసిన సెటైరికల్ కామెంట్స్‌ను స్క్రీన్ షాట్లు తీసి, ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. రోహిత్ ఫామ్ గురించి నువ్వు మాట్లాడొచ్చు కానీ, నేను రాహుల్ ఫామ్ గురించి మాట్లాడొద్దా? అయినా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, వాటికి వ్యక్తిగత అజెండాలంటూ అర్థం లేని కామెంట్లు చెయొద్దంటూ గట్టి కౌంటరిచ్చాడు. దీంతో.. చర్చ ఎటో వెళ్తుందని.. నేను య్యూట్యూబ్‌లో మీరు ట్విట్టర్‌లో అయితే కష్టం కానీ, లైవ్‌గా, వీడియో చాట్‌లో డిబేట్‌లో పాల్గొందామని ఆకాశ్ చోప్రా, ప్రసాద్‌ను ఆహ్వానించారు.
భిన్నాభిప్రాయాలను వ్యక్తిగత అజెండా అంటూ మాట్లాడిన తర్వాత.. ఇంకా డిబేట్ ఎందుకని, ఇక్కడితో ఈ చర్చ ముగిస్తున్నానని, వ్యక్తిగత అజెండాతో విమర్శలు చేస్తున్నారు అన్నందుకే నాకు కోపం వచ్చినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. అలాగే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆటగాళ్లపై విమర్శలు చేస్తున్నారనే ఆరోపణపై కూడా ప్రసాద్ వివరణ ఇచ్చారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్ల ఫోన్లు వాడరని, మన విమర్శలు వారిపై ఎలాంటి ప్రభావం చూపవని ప్రసాద్ పేర్కొన్నారు. చోప్రా-ప్రసాద్ మధ్య గొడవను ఆపేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రంగంలోకి దిగాడు. ‘రాహుల్‌ను వంటరిగా వదిలేయండి. అతను ఎలాంటి నేరం చేయలేదు. రాహుల్ ఇప్పటికీ టాప్ ప్లేయరే. అతన కచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఎత్తుపల్లాలు సహజమే. అతను మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. అందరికి జరిగేదే. ఈ వాస్తవాన్ని అందరు గ్రహించాలి.’ అంటూ ట్విట్ చేశాడు. మరి భజ్జీ ట్వీట్ తర్వాత అయినా.. ప్రసాద్-ఆకాశ్ చోప్రా ఈ మాటల యుద్ధానికి స్వస్తి పలుకుతారో లేదో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
Shubhman Gill has had a brief international career and in 14 overseas innings averages 37, with his 91 at Gabba amongst the best overseas 4th innings and has been in outstanding form .
— Venkatesh Prasad (@venkateshprasad) February 20, 2023
So my friend Aakash Chopra after making a vile video on YouTube this morning where he calls me an agenda peddle, conveniently and cleverly misquotes me, removes Mayank’s average of 70 at home, wants to gag views which are not in line with what he believes but wanted Rohit out pic.twitter.com/2HwFLMgvmd
— Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023
No Aakash, nothing is lost in translation. In your 12 minute video you have called me as an agenda peddler because it didn’t suit your narrative.
It is crystal clear. And I have made my points very clear in this Twitter thread. Don’t wish to engage with you further on this 🙏🏼 https://t.co/GhlfWI0kHA
— Venkatesh Prasad (@venkateshprasad) February 21, 2023