విశ్వక్రీడల్లో భారత్ కు గర్వకారణంగా నిలిచిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో భాగంగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో పురుషుల విభాగం ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. తద్వారా 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత తరపున ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్ షిప్స్ లో మెడల్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. డిఫెండింగ్ ఛాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 90.46 మీటర్ల దూరం బల్లెం విసిరి.. స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇక నీరజ్ చోప్రా మాత్రం తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరి, రెండో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు.
రెండో ప్రయత్నంలో 82.39 మీటర్లు దూరం బల్లెం విసిరిన నీరజ్ చోప్రా మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు జావెలిన్ విసిరాడు. అయితే ఇవేవీ పతకాన్ని తెచ్చేవి కాదని భావించిన నీరజ్.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు జావెలిన్ విసిరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇక చెక్ రిపబ్లిక్ చెందిన అథ్లెటిక్ వాద్లెచ్ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి.. మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. కాగా 46 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్‌కు ఇది కేవలం రెండో పతకం మాత్రమే. 2003లో పారిస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో లాంగ్ జంప్ లో అంజు బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది.
మళ్లీ ఇన్నేళ్ల కు భారత్ కు పతకం దక్కింది. ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో నీరజ్ చోప్రాతో పాటు మరో భారత్ అథ్లెట్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్ కు చేరుకున్నప్పటికీ రాణించలేకపోయాడు. గత టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి నీరజ్ చోప్రా మెరిసిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ వర్డల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో రజత పతకంతో మరోసారి సత్తా చాటాడు. మరి.. నీరజ్ చోప్రాకి రజత పతకం రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
India’s pride #NeerajChopra scripts history!
Ending a 19-year-long wait, Neeraj Chopra becomes the second Indian and the first athlete to secure a medal for India in javelin throw at the #WorldAthleticsChampionships.
Congratulations to him for winning the Silver🥈🇮🇳 pic.twitter.com/DXJzHtKRqj
— P C Mohan (@PCMohanMP) July 24, 2022
BREAKING:
World Championship Medal for India!@Neeraj_chopra1 wins Silver Medal in men’s Javelin Throw final of the #WorldAthleticsChamps with a throw of 88.13m@WorldAthletics pic.twitter.com/nX0aylUIeU
— DD News (@DDNewslive) July 24, 2022
ఇదీ చదవండి: Virat Kohli: నా ‘లక్ష్యమదే’.. మనసులో మాట బయటపెట్టిన విరాట్ కోహ్లీ!
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ క్రికెటర్ అరుదైన రికార్డు.. ఏకంగా 410 పరుగులు..!