క్రికెట్ లవర్స్ కు హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్, వన్డే కప్ లను హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చంటూ అధికారికంగా ప్రకటించింది.
క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన హాట్ స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదిలో జరగనున్న ఆసియా కప్, వన్డే కప్ ఉచితంగా చూడవచ్చు అంటూ అధికారికంగా తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న క్రికెట్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. కానీ, హాట్ స్టార్ ఇక్కడ మరో ట్విస్ట్ పెట్టింది. ఈ రెండు టోర్నీలను కేవలం మొబైల్ ఫోన్ లో మాత్రమే ఉచితంగా చూడటానికి అవకాశం కల్పించినట్లుగా హాట్ స్టార్ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్, వన్డే కప్ ఈ ఏడాది జరగనుంది. ఆసియా కప్ సెప్టెంబర్ లో మాసంలో జరగనుండగా, ప్రపంచ కప్ మాత్రం అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగనుందని మాత్రం తెలుస్తుంది. ఇకపోతే, ఈ రెండు టోర్నీలను మొబైల్ మాత్రమే ఉచితంగా చూడటానికి హాట్ స్టార్ అవకాశం కల్పించడంతో క్రికెట్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. ఈ మధ్యే ఐపీఎల్ ముగియడంతో త్వరలో ప్రారంభం కానున్న ఈ రెండు టోర్నీల కోసం క్రికెట్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.