తన ఆటతీరుతోనే కాకుండా తన అంద, చందాలతో సైతం ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది టీమిండియా ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మందన. ఇమెకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం స్మృతి మందనను ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఇక విషయం ఏంటంటే? అయితే టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా.. వన్డేలను శ్రీలంక గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇటు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ మూడు చొప్పున సిరీస్‌ల్లో ఆడుతోంది.
మొదటి టీ20ని భారత్ గెలుచుకుంది. అయితే మరోవైపు సొంతగడ్డపై తొలి 20లో ఓడటంతో శ్రీలంక టీం ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని శ్రీలంక జట్టు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను ఇక్కడే నెగ్గాలనే యోచనలో హర్మన్ ప్రీత్ కౌర్ టీమ్ ఉందట. ఇదిలా ఉంటే ఈ మ్యాచులను చూసేందుకు శ్రీలంకలోని అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Joe Root: బ్యాట్‌తో రూట్ మరో మ్యాజిక్.. నేలకేసికొడితే సీలింగ్‌కు అతుక్కుంది!
అయితే ఇటీవల మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ అభిమాని టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందనపై తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోల్ లేదు.. అయినా సరే స్మృతి మంధానను చూడ్డానికి స్టేడియానికి వచ్చా.. అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ఆ అభిమాని ప్రదర్శించాడు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని కారణాల వల్ల పెట్రోల్ సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే. అయినా కూడా క్రికెట్ కు ఆదరణ మాత్రం తగ్గట్లేదని ఇది చూస్తే అర్థమవుతోంది. టీమిండియా ప్లేయర్ స్మృతి మందనపై అభిమానాన్ని చాటుకున్న ఈ ఫ్యాన్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Smriti Mandhana fans in Sri Lanka. pic.twitter.com/gZny0Irm9q
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2022