స్మృతి మంధానను లేడీ విరాట్ కోహ్లీగా ఇన్ని రోజులు ఆకాశానికెత్తిన కోహ్లీ ఫ్యాన్స్, ఇప్పుడు ఆమెను తిట్టిపోస్తున్నారు. తమ పరువు తీస్తోందంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
మెన్స్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ఎంతటి స్టార్ డమ్ ఉందో.. ఉమెన్స్ క్రికెట్‌లో స్మృతి మంధానది అదే స్థాయి. పైగా ఇద్దరి జెర్సీ నంబర్లు కూడా ఒకటే. 18 నంబర్ జెర్సీతో ఇద్దరు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఉమెన్స్ క్రికెట్‌కు బాగా ఆదరణ పెరిగింది. మంధానను విరాట్ కోహ్లీ అని, హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ధోని అని, షఫాలీ వర్మను సెహ్వాగ్ అంటూ క్రికెట్ అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. లేడీ కోహ్లీ అని స్మృతి మంధానను ఆకాశానికెత్తిన విరాట్ కోహ్లీ ఫ్యాన్సే ఇప్పుడు ఆమెను తిట్టిపోస్తున్నారు. కోహ్లీ ఫ్యాన్స్‌కు మంధానపై ఇంత కోసం ఎందుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటివల బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఈ లీగ్‌ను గొప్ప మైలురాయిగా క్రికెట్ నిపుణులు కీర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉమెన్ క్రికెటర్లు సైతం ఎంతో సంతోషంగా ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. అనుకున్నట్లే వేలంలో ఉమెన్ క్రికెటర్లపై కనీ విని ఎరుగని రీతిలో కోట్ల వర్షం కురిసింది. అందరి కంటే ఎక్కువ ధర స్మృతి మంధానకే దక్కింది. ఆమె ఆట, ఆమెకున్న స్టార్ డమ్ దృశ్య ఆమెను తమ జట్టులోని తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజ్‌లు పోటీపడ్డాయి. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మంధానను రూ.3.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇంత ధర మరే క్రికెటర్‌కు దక్కలేదు. వేలంపాటలోనే ఆమెదే రికార్డు ప్రైజ్.
అయితే.. మెన్స్ ఐపీఎల్‌లో ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదనే విషయం తెలిసిందే. కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఆర్సీబీనే నంబర్ వన్ టీమ్. విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్ ఆర్సీబీకి ఆలా ఏళ్లు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలుపలేకపోయాడు. 2016లో ఒకసారి ఆర్సీబీని ఫైనల్‌కు వెళ్లినా.. నిరాశ తప్పలేదు. అలా కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ సాధించలేనిది, కనీసం స్మృతి మంధాన కెప్టెన్సీలో అయినా ఉమెన్స్ టీమ్ సాధిస్తుందని కోహ్లీ ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, తీరా చూస్తే.. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మంధాన దారుణంగా విఫలం అయ్యింది. వరుసగా తొలి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయి దారుణ విమర్శలు ఎదుర్కొంటుంది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇంత దారుణంగా విఫలం అవుతున్నందుకు కోహ్లీ ఫ్యాన్స్ మంధానపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ల సంగతి తర్వాత కనీసం నువ్వైనా సరిగ్గా ఆడాలంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Smriti Mandhana wants to emulate Virat Kohli’s success with RCB in the WPL 🤝
📹 https://t.co/afZwuDN6ET | #WPL2023 pic.twitter.com/gBkBoo0uXn
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2023
Legacy Is Legacy Haarcb
Smriti Mandhana And Virat Kohli 🤝#RCBvUPW #SmritiMandhana #WPL pic.twitter.com/JxxWgKjQfx— Shubham 🇮🇳 (@DankShubham) March 10, 2023