ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే క్రికెట్‌పై కూడా కరోనా మహమ్మారి తన పంచా విసురుతోంది. తాజా అండర్19 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత జట్టుపై తన ప్రతాపం చూపింది. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు ఎస్కే రషీద్‌తో పాటు ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్‌కి కోవిడ్ సోకింది. దీంతో బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరు బరిలోకి దిగలేకపోయారు.
17 మంది సభ్యులతో కూడిన జట్టు వరల్డ్‌కప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆరుగురు ప్లేయర్లు కరోనా బారిన పడ్డంతో మిగిలిన 11 మంది ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగారు. కీలకమైన ప్లేయర్లు ఈ మ్యాచ్‌కు దూరమైనా.. బెంచ్ ప్లేయర్లు తమ సత్తా చాటారు. ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు అందరూ మైదానంలోనే ఉండడంతో టీమ్ కోచ్ ప్లేయర్ల కోసం డ్రింక్స్ తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి తర్వాతి మ్యాచ్‌కు ఇదే జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.
మరి ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో మరెవరికైన కరోనా సోకితే పరిస్థితి ఏంటో అని బీసీసీఐ ఆందోళన చెందుతుంది. అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ కరోనా వల్ల పరిస్థితి తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. మరి టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.