టీమిండియా స్టార్ పేసర్ తండ్రయ్యాడు. దీంతో అతడికి ఫ్యాన్స్ అందరూ విషెస్ చెబుతున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు కూడా అతడికి విషెస్ చెబుతున్నారు.
టీమిండియా స్పీడ్‌స్టర్ ఉమేశ్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. 2010 నుంచి భారత జట్టుకు ఆడుతున్న ఉమేశ్.. టీమ్‌లో ఇంకా సెటిల్ అవ్వలేదు. వన్డేలు, టీ20లు ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఆడినా.. దేంట్లోనూ పూర్తిగా ఇమడలేదు. ప్రస్తుతం టెస్టుల్లో జాతీయ జట్టుకు ఆడుతున్న ఉమేశ్.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టును తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో చక్కటి పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి కంగారూల పతనాన్ని శాసించాడు. ఇటీవల ఉమేశ్ తండ్రి మరణించిన విషయం విదితమే. ఆ బాధ, దుఃఖాన్ని గుండెల్లో దిగమింగి మరీ మూడో టెస్టులో రాణించాడు.
ఆసీస్‌తో మూడు టెస్టులో ఉమేశ్ పెర్ఫార్మెన్స్పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి పట్టుదల చూసి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ ఉమేశ్‌ను మాత్రం అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఉమేశ్ తండ్రయ్యాడు. బుధవారం (మార్చి 8వ తేదీ) పండంటి ఆడబిడ్డకు ఉమేశ్ భార్య తాన్యా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఈ పేసర్ వెల్లడించాడు. మహిళల దినోత్సవం నాడే ఉమేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టడం విశేషం. తండ్రి మరణంతో బాధలో ఉన్న ఈ స్పీడ్‌స్టర్‌కు ఇది పెద్ద గుడ్‌న్యూస్ అతడి ఫ్యాన్స్ అంటున్నారు.
Blessed with baby girl ❤️ pic.twitter.com/nnVDqJjDGs
— Umesh Yaadav (@y_umesh) March 8, 2023