అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా రికార్డు సృష్టించింది. ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన టీమిండియా.. ఐదోసారి టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టడం ఇది ఎనిమిదోసారి. ఈ జైత్రయాత్ర మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీ నుంచి మొదలైంది.
🏆 2000
🏆2008
🏆2012
🏆2018
🏆2022India U19 – The FIVE-TIME World Cup Winners 👏 🔝#U19CWC #BoysInBlue pic.twitter.com/B9oWdlSl6H
— Smit Nayak (News18Gujarati) (@SmitNayak18) February 6, 2022
మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో: 2000అండర్-19 వరల్డ్ కప్ తొలి రెండు ఎడిషన్లలో 6వ స్థానం, 5వ స్థానంలో నిలిచిన భారత జట్టు తొలిసారి అండర్-19 వరల్డ్ కప్ ను 2000 సంవత్సరంలో ముద్దాడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 179 పరుగుల లక్ష్యాన్ని 56 బంతులు మిగిలి ఉండగానే చేధించింది కైఫ్ సేన. యువరాజ్ సింగ్, వేణుగోపాల్ ఈ టోర్నీలో భారత జట్టులో సభ్యులు.
విరాట్ కోహ్లీ నాయకత్వంలో: 2008ఈ టోర్నీ ఆద్యంతం అద్భుతంగా రాణించిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ లో సఫారీలపై సవారీ చేసింది అని చెప్పవచ్చు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించాడు. 159 పరుగులు చేసిన భారత జట్టు.. ప్రత్యర్థి జట్టును 103 పరుగులకే కట్టడి చేసింది. డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం విజయం టీమిండియాను వరించింది. రవీంద్ర జడేజా, మనీష్ పాండే, సౌరభ్ తివారీ ఈ టోర్నీలో భారత జట్టులో సభ్యులు.
ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలో: 2012ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భారత జట్టుకు ఉన్ముక్త్ చంద్ నాయకత్వం వహించాడు. క్వీన్స్ లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టుని 6 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (111) సెంచరీతో రాణించడంతో భారత జట్టు 226 లక్ష్యాన్ని కూడా అలవోకగా చేధించింది.
పృథ్వీ షా నాయకత్వంలో: 2018న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో టీమిండియా నాలుగో టైటిల్ సొంతం చేసుకుంది. మరోసారి ఆస్ట్రేలియాను ఓడించి విజయకేతనం ఎగరవేసింది. 217 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా చేధించింది.ఈ మ్యాచ్ లో మన్జోత్ కల్రా 101 పరుగులతో రాణించాడు. ఈ టోర్నీలో భారత జట్టుకు పృథ్వీ షా నాయకత్వం వహించాడు.
యశ్ ధుల్ నాయకత్వంలో: 2022ఐదో సారి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను 189 పరుగులకే కట్టడి చేసింది భారత జట్టు.. 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన ఈ టోర్నీలో భారత జట్టుకు యశ్ ధుల్ నాయకత్వం వహించాడు.