క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు పదిలంగా ఉంటే మరికొన్ని బద్దలవుతుంటాయి. టీమ్ ఇండియా క్రికెట్లో 52 ఏళ్లుగా ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు ఉందంటే నమ్మగలరా. బూమ్రా, షమీ, సిరాజ్ కాదు..అతడే తోపు..ఇప్పటికే కాదు ఎప్పటికీ..
టీమ్ ఇండియా క్రికెట్ హిస్టరీలో ఇప్పటికీ చెరగని రికార్డులు చాలానే ఉన్నాయి. ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ విజయం తరువాత ఒకే సిరీస్‌లో అత్యధికంగా వికెట్లు ఎవరు తీశారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న టీమ్ ఇండియా బౌలర్లు అశ్విన్, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్ లేదా కుంబ్లే వంటి బౌలర్ల గురించి చర్చించుకుంటున్నారు. అయితే వీళ్లెవరూ కాదు..దాదాపు దశాబ్దాల క్రితమే ఓ బౌలర్ పేరిట రికార్డు ఉందని చాలా మందికి తెలియదు.
ఎవరీ బౌలర్
52 ఏళ్ల క్రితం అంటే 1972-73లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా అప్పటి బౌలర్ బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఈ రికార్డు ఉంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకూ ఏ భారతీయ బౌలర్ ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.ఆ సిరీస్‌లో బీఎస్ చంద్రశేఖర్ 19.11 సగటుతో 35 వికెట్లు తీశాడు. బెస్ట్ ప్రదర్శన 6/38.16 ఏళ్ల కెరీర్లో 58 టెస్టులు ఆడిన చంద్రశేఖర్ 242 వికెట్లు పడగొట్టాడు. ఇతని కంటే ముందు 1951-52లో ఇంగ్లండ్‌పై వినూ మన్కడ్ 34 వికెట్లు పడగొట్టగా, 1955-56లో న్యూజిలాండ్‌పై సుభాష్ మన్కడే కూడా 34 వికెట్లు సాధించాడు. ఇక 1979-90లో పాకిస్తాన్‌తో జరిగిన 6 టెస్టుల సిరీస్‌లో కపిల్ దేవ్ 32 వికెట్లు తీయగా, 2000-01లో ఆస్ట్రేలియాపై 3 టెస్టుల సిరీస్‌ల హర్భజన్ సింగ్ 32 వికెట్లు తీశాడు. ఇక అశ్విన్ 2020-21లో ఇంగ్లండ్‌పై 32 వికెట్లు తీయగా, బూమ్రా 2024-25లో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో 32 వికెట్లు తీసుకున్నాడు.
టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్ల ప్రపంచ రికార్డు ఇంగ్లండ్ బౌలర్ సిడ్నీ బర్న్స్ పేరు మీద ఉంది. 1913-14లో దక్షిణాఫ్రికాతో జరిగిన 4 మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు ఏకంగా 49 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు కూడా ఇంకా అలానే పదిలంగా ఉంది.