టీవీ యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రవికి క్రేజ్ ఎక్కువే ఉంది. అయితే తనపై చేతబడి చేశారని, ఆ యాంకర్ క్షుద్రపూజలు చేయించడం చూశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
యాంకర్ రవి గురించి అందరికీ తెలిసిందే. టీవీ షోలలో తనదైన శైలిలో యాంకరింగ్ ద్వారా ఆకట్టుకుంటుండాడు. సంధింగ్ స్పెషల్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన యాంకర్ రవికి ఆ తరువాత అవకాశాలు పెద్దఎత్తున వచ్చాయి. సంధింగ్ స్పెషల్ తరువాత పటాస్, ఆడాళ్లా మజాకా, ఆడాళ్లూ మీకు జోహార్లు వంటి షోలతో బెస్ట్ ఎంటర్ టైనర్‌గా నిలిచాడు. ఇక ఢీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, కిర్రాక్, ఆలీ టాకీస్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రవి సంచలన విషయాలు వెల్లడించాడు. అవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నాపై క్షుద్రపూజలు చేయించింది
తన ఎదుగుదల చూసి ఓర్వలేని ఓ లేడీ యాంకర్ తనపై చేతబడి చేయించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్ పడిపోయే ప్రయత్నం చేసిందన్నాడు. ఇటీవల ట్రెండ్ అవుతున్న ఓ పూజారి వద్దకు వెళ్లి పూజలు చేయించిందన్నాడు. ఓ మనిషి ఎదుగుతుంటే మరో మనిషి ఓర్వలేడని, తాను నాశనమైపోవాలని పూజలు చేయించిందని చెప్పుకొచ్చాడు. సాధారణంగా తానిలాంటివి నమ్మనని అన్నాడు. అయితే ఆ లేడీ యాంకర్ పేరు మాత్రం చెప్పలేదు.
దాంతో ఇప్పుడు ఆ లేడీ యాంకర్ ఎవరనే చర్చ మొదలైంది. ఆమెకు యాంకర్ రవిపై ఎందుకంత కోపమని ప్రశ్నిస్తున్నారు. గతంలో సూపర్ సక్సెస్ అయిన సంథింగ్ స్పెషల్ షో తరువాత యాంకర్ రవితో చేసిన లాస్యతో వచ్చిన విబేధాలు అందరికీ తెలిసినవే. ఒకరిపై మరొకరు భారీగా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తరువాత యాంకర్ రవి శ్రీముఖితోనూ ఇతర యాంకర్లతోనూ కలిసి చేశారు. దాంతో ఈ అందరిలో క్షుద్రపూజలు చేయించింది ఎవరనే చర్చ నడుస్తోంది.