టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం అయినప్పటికీ.. అసలు సంగ్రామం ఇంకా మెుదలు కాలేదనే చెప్పాలి. మరికొన్ని గంటల్లో అసలు యుద్ధం ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 23 న మెల్ బోర్న్ వేదికగా టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు జట్లు తీవ్రంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ నెట్స్ లో కఠోర శ్రమ చేస్తున్నాడు. గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తూ.. ఎప్పుడూ నెట్స్ లోనే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా వెనకాలే ఉండి కొంత మంది ఫ్యాన్స్ అరుస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యాడు కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ.. వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న.. క్రీడా దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సైతం కోహ్లీ లాంటి ఆటగాడిని ఇంత వరకు చూడలేదని కితాబిచ్చాడు. ఇక టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాక్ తో ఆడనుంది. ఈ క్రమంలోనే నెట్స్ లో కోహ్లీ తీవ్రంగా కష్టపడుతున్నాడు. అయితే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అభిమానులు..” భాయ్ అవుట్ ఆఫ్ ది స్టేడియం” అంటూ గట్టిగా అరుపులు కేకలతో.. గోల గోల చేస్తున్నారు. దాంతో నెట్స్ కు అవతలవైపు ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ వైపు తిరిగి “భాయ్ మీరలా అరుస్తుంటే నా ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్లీజ్ నన్ను ప్రాక్టీస్ చేసుకోనివ్వండి” అని అన్నాడు. దాంతో ఫ్యాన్స్ సరే భాయ్ మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో అప్పుడే మాట్లాడతాం.. మీరు కింగ్, కింగ్ కోసం ఏమైనా చేస్తాం.. అంటూ మాట్లాడుకున్నారు.
ఇక ఇదంతా వీడియో తీసి ట్వీటర్ లో షేర్ చేశాడో యువకుడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కింగ్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే. తమ అభిమాన ఆటగాడిని అంత దగ్గర నుంచి చూస్తే ఎవరికైన అరుపులు, ఈలలు రావడం సహజమే.. అని ఈ వీడియో చూసిన వారంత కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ ఎక్కువ సమయం గ్రౌండ్ లోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న విధానం చూసి.. ఈ సారి టీమిండియా కప్ కొట్టడం ఖాయం. అందులో కీలక పాత్ర పోషించేది మాత్రం రన్ మెషిన్ కింగ్ కోహ్లీనే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
During the practice Virat Kohli calmly said something like this to the fans .@imVkohli 👑 pic.twitter.com/3X5LnNTQsV
— Hemant Singh (@Hemant18327) October 20, 2022