మీరు నాని ‘జెర్సీ’ సినిమా చూశారా? అందులో ఓ మ్యాచ్ సందర్భంగా నాని పరుగెత్తడానికి ఇబ్బంది పడతాడు. కాసేపు ఆగి శ్వాస తీసుకుని మళ్లీ గేమ్ కొనసాగిస్తాడు. అయితే మునుపటిలా మాత్రం పరుగెత్తలేకపోతాడు. ఇది సినిమాలో సీన్ కావొచ్చు. కానీ టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు అదే అభిమానుల్లో ఎక్కడలేని టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తే విరాట్.. ఒక్కసారిగా ఇలా అయిపోవడం చూసి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియాలో ఆటగాళ్ల ఫిట్ నెస్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా సరే ముందు గుర్తొచ్చేది విరాట్ కోహ్లీనే. అప్పటివరకు భారత ఆటగాళ్లు నార్మల్ గానే ఉండేవారు. కోహ్లీ శకం మొదలైన తర్వాత సిక్స్ ప్యాక్ ట్రెండ్ షురూ అయింది. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా వర్కౌట్స్ చేస్తూ జట్టులో సరికొత్త మార్పు తీసుకొచ్చారు. అయితే కోహ్లీ తాజాగా 34వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ లో అదిరిపోయే ఇన్నింగ్సులు ఆడుతూ దుమ్మురేపుతున్నాడు.
ఇక తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓసారి 2 పరుగుల్ని చాలా వేగంగా పూర్తి చేశాడు. కాసేపు దిగువకు వంగి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత గుండెపై చేయి వేసుకుని కాస్త రుద్దుకున్నట్లు కనిపించాడు. దీంతో విరాట్ కి గుండె నొప్పి వచ్చిందా అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక ఇది జరిగిన తర్వాత కోహ్లీ సింగిల్స్ మాత్రమే తీస్తూ వచ్చాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటై పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉండగా మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 186/5 స్కోరు చేసింది. ఇక ఛేదనలో తడబడిన జింబాబ్వే.. 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఇక 10వ తేదీన జరిగే సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ తో తలపడనుంది.
— Guess Karo (@KuchNahiUkhada) November 6, 2022
Virat Kohli’s fitness is a benchmark 🏋️#T20WorldCup | @imVkohli pic.twitter.com/tjPare7SWi
— CricTracker (@Cricketracker) November 7, 2022
Most runs in T20 World Cup 2022 Super-12 stage:
246 – Virat Kohli
225 – Suryakumar YadavSurVir 💥💥 pic.twitter.com/90i9mphSTB
— CricTracker (@Cricketracker) November 6, 2022