మెల్ బోర్న్ వేదికగా ఇండియా- పాక్ పోరు ఎలా సాగిందో అందరకి గుర్తుండే ఉంటుంది. విజయం నీదా.. నాదా! అన్నట్లుగా సాగిన ఈ మ్యాచులో భారత జట్టు ఆఖరిబంతికి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ పాకిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్న తీరు ఒక ఎత్తైతే.. ఆఖరి 3 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు అతడు పోరాడిన తీరు మరో అద్భుతం. తన ఇన్నింగ్స్ తో యావత్ పాకిస్తాన్ ప్రపంచానికే నిద్రలేకుండా చేశాడు.. కోహ్లీ. ఇదిలావుంచితే, తాజాగా పాక్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రీదీ.. విరాట్ కోహ్లీని కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ రెండు మ్యాచులు ఆడగా, రెండింటిలోనూ గెలిచి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి, సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇప్పుడు ఇరు జట్లు పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో తలపడాల్సివుంది. ఈ మ్యాచులు ఆదివారం(అక్టోబర్ 30న) జరగనున్నాయి. పాకిస్తాన్- నెదర్లాండ్స్ మ్యాచ్ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుండగా, ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే పెర్త్ చేరుకొని ప్రాక్టీస్‌లో తలమునకలైయున్నారు. ఈ క్రమంలో పాక్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిదీ.. కోహ్లీని కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Virat Kohli meets Haris Rauf and Shaheen Afridi in Parth. pic.twitter.com/HVH2tB8x9i
— CricketMAN2 (@ImTanujSingh) October 29, 2022
క్యాంటీన్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ సూప్ బౌల్ పట్టుకొని కనిపిస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పాకిస్తాన్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది అతనికి ఎదురుపడ్డారు. షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. అఫ్రిది చేతిలో జ్యూస్ గ్లాస్, రవూఫ్ చేతిలో ఖాళీ ప్లేట్ కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ‘అప్పుడు చితకొట్టి.. ఇప్పుడు చిరునవ్వుతో ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడో చూడండి..’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇండియా-పాక్ మ్యాచులో కోహ్లీ ఈ ఇద్దరి బౌలింగ్‌ను చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో హ్యారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మ్యాచ్ సమీకరణాలనే మార్చేశాడు. కోహ్లీ.
And a huge #Diwali Dhamaka and firecrackers by #TeamIndia as it defeats #Pakistan !
What a game @imVkohli !
Congratulations India 🇮🇳✌🏼!
#T20WC2022 #INDvsPAK2022 pic.twitter.com/eYba8BAsdN— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 23, 2022