ఆసియా కప్ 2022 మునుపటి వరకు పరుగుల లేమితో సతమతమైన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, టీ20 ప్రపంచకప్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఒక్క సౌతాఫ్రికా మినహాయిస్తే పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పై హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ లు నామమాత్రమే అయినా, పాకిస్తాన్ పై ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. ఈ టోర్నీలో కోహ్లీ మ్యాచ్ మ్యాచుకు ఇంకా పుంజుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ సైతం కోహ్లీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ పై 82 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ, ఆపై నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులోనూ 62 పరుగులు చేశాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా మ్యాచులో విఫలమైనా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో 64 పరుగులతో రాణించి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ నాలుగు మ్యాచల్లో కోహ్లీ 205 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు(1065) చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతేకాదు.. ఆసీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్(3300) పేరిట ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియా [గడ్డపై కోహ్లీ 3350 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ బీస్ట్ మోడ్ లో ఉన్నాడన్న వాట్సన్, అతన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యపడదని తెలిపాడు.
Virat Kohli has scored the most runs by an Indian in Australia in International cricket.
He over-takes Sachin Tendulkar.
— Johns. (@CricCrazyJohns) November 2, 2022
virat kohli broke sl legend mahela jayawardane most runs in t20 wc one of the greatest sl legend mahela jayawardane says it#T20WorldCup #ICCT20WorldCup pic.twitter.com/MRPdQcvEYT
— Malik Asif Dhakoo (@malikasifdhakoo) November 2, 2022
“ప్రతిష్టాత్మక టోర్నీలో (టీ20 ప్రపంచకప్) వెయ్యికి పైగా పరుగులు, 80కి పైగా సగటు. ఇలా నిలకడగా రాణించడమంటే అంటే మూములు విషయం కాదు. ఈ గణాంకాలను చూశాక, కోహ్లీ నుంచి నాచూపు తిప్పుకోలేకపోతున్నా. టీ20 ఫార్మాట్ అనేది హై రిస్క్ గేమ్. బౌండరీల వేటలో బ్యాటర్లుపై ఒత్తిడి ఎక్కువుంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఇంకా ఎక్కువుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కోహ్లీ అద్భుతంగా రాణిస్తూ, జట్టును.. దేశాన్ని గెలిపిస్తున్నాడు..” అని వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు తదుపరి మ్యాచులో మెల్ బోర్న్ వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచివుంది.
“Kohli is a freak, his stats in the T20 World Cup is freakish and ridiculous”.
~ Shane Watson#ViratKohli𓃵 #crickettwitter pic.twitter.com/8hdOGXNRx1
— King 👑 (@Ajayvk_18) November 3, 2022