పాకిస్థాన్ క్రికెట్ జట్టుని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి అలా ఉంది మరి. టీ20 వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఎందుకంటే టీ20 నంబర్ 1 బ్యాటర్, నంబర్ 1 పేస్ బౌలర్ ఆ జట్టులోనే ఉన్నారు. అలాంటి జట్టు అద్భుతాలు సృష్టించేస్తుందని.. ఆ దేశ అభిమానులతో పాటు క్రికెట్ ని చూసే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది, జరుగుతున్నది వేరు. టీమిండియాతో తొలి మ్యాచ్ లో ఓడిపోయిందంటే ఆ ఏముందిలే.. కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ దానికి కారణమని తెలుస్తోంది. తాజాగా జరిగిన జింబాబ్వే మ్యాచ్ లో ఓడిపోవడం మాత్రం పాక్ జట్టుకు పీడకలే. అయితే ఈ రెండు మ్యాచుల్లో ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజాం కుట్రనే కారణమని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మొన్న జరిగిన భారత్-పాక్ మ్యాచ్ నే తీసుకోండి. ఈ టోర్నీ ముందు చాలా నెలల నుంచి కోహ్లీ ఫామ్ లో లేడు, ప్రతి ఫార్మాట్ లోనూ విఫలమవుతూ వచ్చాడు. దీంతో చాలామంది మాజీలు.. కోహ్లీని జట్టు నుంచి తీసేయాలి, పీకి పడేయాలి లాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే కోహ్లీ.. తన అనుభవం ఉపయోగించి, ఓడిపోతుందని అందరూ అనుకున్న మ్యాచ్ ని గెలిపించారు. ఇక మరో సీనియర్ ఆటగాడు అశ్విన్.. 1 బంతికి రెండు పరుగుల కావాల్సిన స్థితిలో బుర్ర ఉపయోగించి బంతిని వదిలేశాడు. అది మ్యాచ్ కే టర్నింగ్ పాయింట్ అయింది. ఈ రెండు సందర్భాలు చాలు.. సీనియర్ క్రికెటర్స్ అనుభవం మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తుందని చెప్పడానికి.
ఇక పాక్ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్ బాబర్ ఆజాం నేతృత్వంలో టీ20 వరల్డ్ కప్ లో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో జస్ట్ మిస్ లో ఓడిపోయింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో అనేసరికి.. చాలామంది పాక్ గెలుస్తుందని ఫిక్సయిపోయారు. అంతెందుకు పాక్ క్రికెటర్లు కూడా లైట్ తీసుకున్నారు. అదే ఆ జట్టు కొంపముంచింది. ఒకే ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే గెలిచేసింది. ఇలా అత్యుత్తమ జట్టయిన పాక్.. టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో వరసగా రెండు మ్యాచులు ఓడిపోవడం చాలామందికి షాకిచ్చింది. అదే టైంలో చాలా సందేహాలు కూడా రేకెత్తించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఎంత పెద్ద కుట్ర చేశాడనే విషయం రివీలైంది. దీని గురించి స్వయంగా పాక్ అభిమానులే మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం టోర్నీలో పాక్ జట్టునే తీసుకోండి. అందులో మీకు కెప్టెన్ బాబర్ ఆజాం, బౌలర్ షాహీన్ అఫ్రిది తప్పించి మరో ప్లేయర్ తెలీదు. ఇలాంటి టోర్నీల్లో మిగతా ఆటగాళ్లకు అసలు అనుభవమే లేదు. మొన్న మొన్నటి వరకు జట్టులో ఉంటూ బాగా ఆడిన షోయబ్ మాలిక్ లాంటి ఆటగాడిని, కారణంగా లేకుండా జట్టు నుంచి తప్పించారు. ఫకర్ జమాన్ లాంటి సీనియర్ ప్లేయర్ ని గాయం పేరు చెప్పి సైడ్ చేశాడు. అతడితో పాటే గాయపడ్డ షాహీన్ అఫ్రిది జట్టులోకి వచ్చేశాడు. మ్యాచులు కూడా ఆడేస్తున్నాడు. టోర్నీలో రెండు మ్యాచ్ లు జరిగిపోయినా సరే జమాన్ ని మాత్రం జట్టులోకి తీసుకోవట్లేదు. మరోవైపు జట్టులో సీనియర్స్ ఉంటే తన మాట చెల్లదని, అందుకే తన మాట వినే ఆటగాళ్లని మాత్రమే బాబర్, జట్టులోకి ఎంపికయ్యేలా చేశాడు! ఇప్పుడు వాళ్ల అనుభవలేమి జట్టు ఓటములకు కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కాదన్నట్లు పాక్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న బాబర్, ఆఫ్రిది కూడా స్థాయికి తగ్గ ఫెర్ఫామెన్స్ అస్సలు చేయట్లేదు. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందని, ఇప్పటికైనా బాబర్ ఆజాం కళ్లు తెరుచుకోవాలని.. లేదంటే పాక్ జట్టు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Remove Babar Azam from the captaincy and change the opener how long will you make fun of yourself and your country 🇵🇰 #T20worldcup22 pic.twitter.com/JcdkjnwTM8
— John Burke (@SirJohnBurke) October 27, 2022
You all were trolling him when my man was spitting facss.
——
Ramiz Raja , Pakistan Cricket Team , Lumber 1 Babar Azam pic.twitter.com/em0AEj3Ws9— نعمان خان سلیمانی (@nomanksulemani) October 27, 2022
No excuses for Babar Azam and Pakistan #PAKvZIM | #T20WorldCup
👉 https://t.co/BbVD1wQDLh pic.twitter.com/nMTqe4p1tU
— ESPNcricinfo (@ESPNcricinfo) October 27, 2022
This loss will haunt Babar Azam and entire Pakistani fans forever. pic.twitter.com/VHPpnTVESG
— Avinash Aryan (@AvinashArya09) October 27, 2022
Thats it, thats the tweet.#PAKvsZIM#T20WC2022
Haider Ali
Babar Azam
Asif Ali pic.twitter.com/JYZfQnI5dk— Fahad Khokhar (FK) (@fkhokhar98) October 27, 2022
Babar Azam just couldn’t believe what happened.
Courtesy – Zimbabwe! pic.twitter.com/d41VaMAA1B
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2022