టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు దూసుకెళ్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు సాధించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ లో అయితే చూస్తున్న ప్రేక్షకుల నరాలు తెగిపోతాయా అనేంత థ్రిల్ ఇచ్చారు. ఇక నెదర్లాండ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో సింపుల్ గా విజయం సాధించారు. తొలి మ్యాచ్ లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కూడా ఈసారి రెచ్చిపోయారు. ఇక బౌలర్లు కూడా తమ వంత బాధ్యత నిర్వర్తించారు. ఇక్కడా అంతా బాగానే ఉన్నా సరే ఒక్క వ్యక్తి మాత్రం ప్రతిసారి నిరాశపరుస్తున్నాడు. భారత జట్టు అభిమానుల నమ్మకాన్ని కోల్పోతున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది బ్యాటరో అందరికీ తెలుసు. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడే ఇతడు.. టోర్నీలు, సిరీస్ లు అనేసరికి మాత్రం తేలిపోతున్నాడు. సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. పాకిస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో 8 బంతులాడి 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక నెదర్లాండ్స్, చిన్న జట్టే కాబట్టి పక్కాగా బ్యాటింగ్ అదరగొడతాడని అందరూ భావించారు. ఇందులో కూడా ఫెయిలయ్యాడు. 12 బంతులాడి కేవలం 8 పరుగులే చేసి ఔటయ్యాడు. రిప్లేలో అది నాటౌట్ అని తేలింది. రివ్యూ తీసుకుని ఉన్నాసరే రాహుల్ బ్యాటింగ్ చేసేవాడు!
టీ20 వరల్డ్ కప్ లో వరసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా.. టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. కాకపోతే రాహుల్ మాత్రం సరిగా ఆడట్లేదు. దీంతో భారత అభిమానుల నుంచి పలు సూచనలు వినిపిస్తున్నాయి. ఓపెనర్ గా రాహుల్ బదులు పంత్ ని తీసుకున్నా సరే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. టోర్నీ నిబంధనలు ప్రకారం కుదరదు గానీ పృథ్వీషా లాంటి పవర్ హిట్టర్ ని ఇలాంటి టైంలో జట్టులోకి తీసుకొచ్చినా సరే ఓపెనింగ్ సమస్య తీరిపోతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పృథ్వీషా ఉంటే మాత్రం కప్ మనదే అని జోస్యం చెబుతున్నారు. మరి రాహుల్ బ్యాటింగ్ వైఫల్యంపై మీ అభిప్రాయమేంటి?
#INDvsNED #INDvNED
Who is better opener between this two?
Like ❤️ for prithvi Shaw
RT 🔁 for kl rahul pic.twitter.com/Nhb00f6Taq— 👌⭐👑 (@superking1815) October 27, 2022
Indian fans are NOT happy with KL Rahul 😅 #SportsYaari pic.twitter.com/yU1p8gBIhj
— Sushant Mehta (@SushantNMehta) October 27, 2022
I will take any version of Rishabh Pant over this fraud KL Rahul. pic.twitter.com/xc1otxyesQ
— Sourabh (@1handed6) October 27, 2022
KL Rahul is Biggest FRAUD in World Cricket 👍#INDvsNED
— Amit Kumar (@AMIT_GUJJU) October 27, 2022
still a better opener than kl rahul pic.twitter.com/0i4xYcXSwq
— tushR🍕 (@heyytusharr) October 27, 2022
Not an ideal start for vice-captain KL Rahul in this T20 World Cup.#CricTracker #KLRahul #NEDvIND #T20WorldCup pic.twitter.com/SIAoWmaGtu
— CricTracker (@Cricketracker) October 27, 2022