SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Story Of Mr Bean Between Pakistan And Zimbabwe

పాక్‌-జింబాబ్వే మధ్య ‘ఫేక్‌ మిస్టర్‌ బీన్‌’ వివాదం! అసలు నిజాలు!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 28 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పాక్‌-జింబాబ్వే మధ్య ‘ఫేక్‌ మిస్టర్‌ బీన్‌’ వివాదం! అసలు నిజాలు!

టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో జింబాబ్వే పెను సంచలనం సృష్టించింది. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉన్న పాకిస్థాన్‌ను ఒక్క పరుగు తేడాతో మట్టికరిపించి.. దాదాపు టోర్నీ నుంచి ఇంటి బాట పట్టించింది. జింబాబ్వే సాధించిన ఈ విజంయ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అద్భుత విజయంతో జింబాబ్వే టీమ్‌ను క్రికెట్‌ లోకం ఆకాశానికెత్తేస్తుంటే.. పాకిస్థాన్‌ టీమ్‌ ఘోరమైన ఓటమి భారాన్ని మోస్తోంది. పాక్‌ టీమ్‌పై, కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌పై విమర్శల వడగండ్ల వర్షం కురుస్తోంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. జింబాబ్వే తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజాపై ప్రశంసలు, పాక్‌ టీమ్‌పై విమర్శలతో పాటు మరో ప్రఖ్యాత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే ‘మిస్టర్‌ బీన్‌’.. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రముఖ కమెడియన్‌ మిస్టర్‌ బీన్‌కు జింబాబ్వే-పాకిస్థాన్‌కు ఏంటి సంబంధం? ఈ రెండు దేశాల మధ్య అతనెందుకు వచ్చాడు? అసలు ఈ ఫేక్‌ మిస్టర్‌ బీన్‌ కథేంటని క్రికెట్‌ అభిమానులు తెగహైరానా పడిపోతున్నారు. అసలు ఈ వీళ్ల మధ్య గొడవేంటి? బీన్‌ కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌ 2022లో సూపర్‌ 12లో భాగంగా గురువారం జింబాబ్వే-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. పైగా కేవలం 130 పరుగులు స్కోర్‌ను జింబాబ్వేపై ఛేదించలేక చతికిలపడింది. ఈ సంచలన విజయంతో అంతా ఒక్కసారిగా అవాక్కైయ్యారు. కానీ.. ఓడింది పాకిస్థాన్‌ కావడంతో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు. క్రికెట్‌ ప్రపంచంలో చిన్న జట్టుగా ఉన్న జింబాబ్వే.. పాక్‌ లాంటి బలమైన జట్టును ఓడించడం పెద్ద విషయమే. ఈ విజయంపై జింబాబ్వే అధ్యక్షుడు సైతం స్పందించారు. ఆటగాళ్లను అభినందించారు కూడా.. కానీ.. తన ట్వీట్‌లో ‘ఈ సారి అయినా రియల్‌ మిస్టర్‌ బీన్‌ పంపించండి’ అంటూ పేర్కొన్నారు.

మ్యాచ్‌ గెలిచినందుకు ఆటగాళ్లను అభినందించారు, జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు సరే.. మరీ ఈ రియల్‌ మిస్టర్‌ బీన్‌ పంపమనడం ఏంటి? పైగా పాక్‌-జింబాబ్వే మధ్య మ్యాచ్‌కు ముందు, తర్వాత రియల్‌ మిస్టర్‌ బీన్‌, ఫేక్‌ మిస్టర్‌ బీన్‌ పదాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. వీటికి.. పాక్‌-జింబాబ్వేకి ఏంటి లింకంటే.. 2016లో జింబాబ్వేలోని హరారె ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఒక కామెడీ షో నిర్వహించారు. ఈ షో కోసం రియల్‌ మిస్టర్‌ బీన్‌ అలియాస్‌ రొవాన్ అట్కిన్సన్‌ను పంపుతున్నట్లు పాకిస్థాన్‌ బిల్డప్‌ ఇచ్చింది. ఒక కారులో బీన్‌ జింబాబ్వేలో రోడ్‌ షో కూడా నిర్వహించాడు. అప్పటికే బీన్‌ ప్రపంచ ప్రఖ్యాత కమెడియన్‌గా ఉండటంతో.. జింబాబ్వే ప్రజలు అతనితో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. కానీ.. తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్యర్యపోయారు.

Join Our Whatsapp Channel

అతను నిజమైన మిస్టర్‌ బీన్‌ కాదు.. అతని పోలికలతో ఉన్న పాకిస్తాన్ కమెడియన్ ఆసీఫ్ మహ్మద్. అసలైన మిస్టర్‌ బీన్‌లా బిల్డప్‌ ఇస్తూ.. జింబాబ్వే ప్రజలను మోసం చేయడంతో పాటు షోలో అతనే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఈ విషయం వివాదాస్పదం కూడా అయింది. అప్పటి అవమానానికి ఇప్పుడు టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా పాక్‌ను ఓడించి జింబాబ్వే ప్రతీకారం తీర్చుకుందని.. జింబాబ్వే క్రికెట్‌ ఫ్యాన్స్‌తో పాటు ఏకంగా ఆ దేశ అధ్యక్షుడే భావించడంతో చర్చనీయాంశమైంది. కాగా.. జింబాబ్వే చేసిన ట్వీట్‌కు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా రిప్లయ్‌ ఇవ్వడం విశేషం. మరోసారి రియల్‌ మిస్టర్‌ బీన్‌ను పంపాలని చెప్పిన జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌కు పాక్‌ ప్రధాని బదులిస్తూ.. ‘మా దగ్గర రియల్‌ మిస్టర్‌ బీన్‌ లేడు. కానీ.. మా వద్ద అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉంది. అలాగే మా పాకిస్థానీలకు బౌన్స్‌ బ్యాక్‌ అయ్యే ఫన్నీ అలవాటు ఉంది. మిస్టర్‌ ప్రెసిడెంట్‌ శుభాకాంక్షలు, మీ జట్టు ఈ రోజు అద్భుతంగా ఆడింది’ అంటూ షరీఫ్‌ ట్వీట్‌ చేశారు.

Pic 1 – Pakistan After 20 overs of Zimbabwe batting

Pic 2- Pakistan after 20 overs of their batting. #PAKvsZIM pic.twitter.com/amXnUFprQy

— Virender Sehwag (@virendersehwag) October 27, 2022

What a win for Zimbabwe! Congratulations to the Chevrons.

Next time, send the real Mr Bean…#PakvsZim 🇿🇼

— President of Zimbabwe (@edmnangagwa) October 27, 2022

We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back 🙂

Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972

— Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022

Tags :

  • Cricket News
  • Mr. Bean
  • pakistan
  • T20 World Cup 2022
  • zimbabwe
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • 4 డిప్యూటీ మేయర్లు.. 17 వైస్ ఛైర్‌పర్సన్లు! జనసేన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే

  • రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. 1,265 పోస్టులు! అప్లై చేసేందుకు 2 రోజులే గడువు..

  • యలహంక ప్యాలెస్ వద్ద హైడ్రామా.. షర్మిలను అడ్డుకున్న పోలీసులు..

  • హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్.. ఫేక్ అని తేల్చిన పోలీసులు!

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

Most viewed

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam