ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. బౌలింగ్‌కు అనుకూలించే పెర్త్ పిచ్‌పై లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడి ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ(15), కేఎల్ రాహుల్(9), విరాట్ కోహ్లీ(12) వెంటవెంటనే అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో ఒంటరిపోరాటం చేయడంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది. ఈ స్కోర్‌ను ఛేదించేందుకు సౌతాఫ్రికా కూడా ఇబ్బంది పడింది. కానీ.. చివరికి 19.4 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి గెలిచింది. మార్కరమ్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ వరల్డ్ కప్‌లో ఎదురైన తొలి ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని ముందే ఊహించి బ్యాటింగ్ తీసుకున్నాం. ఈ పిచ్‌పై ఛేజింగ్ కష్టం. అందుకే ముందు బ్యాటింగ్ తీసుకున్నా.. ఆశించినన్ని పరుగులు చేయలేకపోయాం. సౌతాఫ్రికా మాకంటే మంచి ప్రదర్శన ఇచ్చింది. 10 ఓవర్లలో 40 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయినా.. మార్కరమ్, మిల్లర్ భాగస్వామ్యంతో ఆ జట్టు గెలిచింది.’ అని రోహిత్ అన్నాడు.
అలాగే అశ్విన్‌కు 18వ ఓవర్ ఇవ్వడాన్ని రోహిత్ సమర్థించుకున్నాడు. క్రీజ్‌లో కొత్త బ్యాటర్ ఉన్నాడనే అశ్విన్‌కు ఆ ఓవర్ ఇచ్చా.. అయినా స్పిన్నర్‌కు చివరి ఇస్తే ఏం జరుగుతుందో.. గత మ్యాచ్‌ల్లో చూస్తూనే ఉన్నాం అని భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ అజమ్.. స్పిన్నర్ నవాజ్‌తో చివరి ఓవర్ వేయించడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు రోహిత్. అయినా.. తాను అనుకున్నట్లు అశ్విన్ ఆ ఓవర్ వేసి ఉంటే.. తర్వాతి ఓవర్లను పేసర్లు అద్భుతంగా వేసి గెలిపించేవారు. కానీ.. మిల్లర్ అద్భుతమైన షాట్లు ఆడి.. తన ప్లాన్‌ను నాశనం చేశాడని రోహిత్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తమ ఫీల్డింగ్ చెత్తగా ఉందని రోహిత్ ఒప్పుకున్నాడు. సులువైన రనౌట్లతో పాటు క్యాచ్‌లను నేలపాలు చేయడం మా ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు. ఈ విషయంపై మరింత దృష్టి పెడతామన్నాడు.
Rohit Sharma revealed why Ashwin was given 18th over https://t.co/oNBatUF5ag
— CrickTale Official (@CricktaleO) October 30, 2022