టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్. ఫైనల్లో పాక్ జట్టు బొక్కబోర్లా పడింది. అదృష్టంగా కొద్ది సెమీ ఫైనల్లో అడుగుపెట్టి న్యూజిలాండ్ ని ఓడించింది. కానీ తుదిపోరులో ఇంగ్లాండ్ ని మాత్రం అడ్డుకోలేకపోయింది. దీంతో ఇంగ్లీష్ జట్టు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. సగర్వంగా కప్ ని ముద్దాడింది. ఇకపోతే ఫైనల్లో గెలిచి 1992 సీన్ రిపీట్ చేయాలనుకున్న పాకిస్థాన్.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది. అయితే పాక్ ఓడిపోవడానికి ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన కంటే.. స్వీయ తప్పిదాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అవేంటి? అనేది ఈ స్టోరీలో డిస్కష్ చేద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ జట్టుని చూస్తే ఎవరూ తక్కువ అంచనా వేయరు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ ఫుల్ ఫామ్ లో కనిపించింది. టీ20 నంబర్ 1 బ్యాటర్, బౌలర్ ఇద్దరూ ఆ జట్టులో ఉండేసరికి అంచనాలు కూడా ఎక్కువగానే ఏర్పడ్డాయి. కానీ పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజామ్.. టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఫెయిలయ్యారు. చాలా కీలకమైన ఫైనల్లోనూ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ తో తుదిపోరులో రిజ్వాన్ 15, బాబర్ 32 పరుగులు మాత్రమే చేశారు. మిగతా మ్యాచ్ ల సంగతి పక్కనబెడితే.. ఫైనల్లో వీరిద్దరూ అద్భుతమైన పార్ట్ నర్ షిప్ ఇచ్చినా సరే పాక్ జట్టుకి విజయం దక్కేదేమో!
మరోవైపు పాక్ జట్టులో టాప్ క్లాస్ బౌలర్ షాహీన్ అఫ్రిది కూడా కీలక దశలో బౌలింగ్ చేయలేకపోయాడు. గాయం నుంచి కోలుకోవడం వల్ల కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు… కానీ ఫైనల్లో తేలిపోయాడు. కేవలం 2.1 ఓవర్లు వేసి ఓ వికెట్ తీసి 13 పరుగులు ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించిన ఓవర్లలోనే షాహీన్ వికెట్లు తీసుంటే.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగేది. కానీ అలా చేయకపోవడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా నిలకడగా ఆడుతూ మ్యాచ్ ని గెలిపించారు. ఇకపోతే 2019లో వన్డే వరల్డ్ కప్, ఇంగ్లాండ్ గెలుచుకోవడం బెన్ స్టోక్స్ మెయిన్. ఫైనల్లో అతడికి ఎలా ఆడాలో బాగా తెలుసు. అలాంటి బ్యాటర్ ని పాక్ బౌలర్లు త్వరగా ఔట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ అలా చేయలేకపోయారు. కప్ ఇంగ్లాండ్ కి చేజేతులా అప్పజెప్పారు.
మరోవైపు ఇంగ్లాండ్ జట్టు పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కానీ స్పిన్ విషయంలో తడబడుతుంది. ఈ విషయాన్ని పాక్ జట్టు కరెక్ట్ గా కాన్స్ ట్రేట్ చేసుంటే.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ రిజల్ట్ వేరేలా ఉండేది. కానీ పాక్ జట్టు స్పిన్నర్ల కంటే పేసర్లపైనే ఆధారపడింది. మరోవైపు స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్స్ మాత్రం తీయలేకపోయాడు. మరో స్పిన్నర్ ఇఫ్తికర్ అహ్మద్ 5 బంతులే వేసి 13 పరుగులిచ్చేశాడు. దీన్నిబట్టి చూస్తే ఇంగ్లాండ్ స్పిన్ ఆడలేదని తెలిసినా సరే పాక్ సరైన ప్లాన్ వేయలేకపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. మరోవైపు పాక్ మిడిలార్డర్ కూడా టీ20 వరల్డ్ కప్ విఫలమవుతూనే వచ్చింది. ఇక ఎంతో కీలకమైన ఫైనల్లో కూడా చేతులెత్తేసింది. మసూద్ 38, షాదాబ్ ఖాన్ 20 తప్పించి.. మిగతా బ్యాటర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
ఇలా మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యం కూడా పాక్ జట్టు ఫైనల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ వాళ్లలో ఎవరు కరెక్ట్ గా ఇన్నింగ్స్ ఆడినా సరే ఓవరాల్ స్కోరు పాక్ ఎక్కువగా చేసి ఉండేది. తద్వారా ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పడేది. ఈ విషయంలో పాక్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు పాక్ ఫీల్డింగ్, రివ్యూలు తీసుకునే విషయంలో చాలా తప్పిదాలు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డుని నెమ్మదిగా పరుగులెత్తించారు. మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం మాత్రం ఈ విషయంలో ఏం చేయలేక చేతులెత్తేశాడు. ఇదిలా ఉండగా 1992 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేయాలనుకున్న పాక్ జట్టుకు.. ఫైనల్లో ఇంగ్లాండ్ దెబ్బకు మొండిచేయి మాత్రమే మిగిలింది. మరి పాక్ జట్టు ఓటమిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Congratulations! England Cricket Team! 🇬🇧#T20WorldCupFinal #T20WorldCup #PAKvENG #Pakistan #England #crickettwitter pic.twitter.com/tnAe7D8nNB
— RVCJ Media (@RVCJ_FB) November 13, 2022
Match turning point for Pakistan #T20WorldCupFinal #T20WorldCup #PAKvENG #EngvsPak #ICCT20WC pic.twitter.com/ueSMAtMJUj
— RVCJ Media (@RVCJ_FB) November 13, 2022
Credit to Pakistan. Few teams would have defended 137 the way they did. Best bowling team.
— Harsha Bhogle (@bhogleharsha) November 13, 2022