వరల్డ్ బెస్ట్ పేస్ బౌలర్లు ఎవరంటే చాలా మందే గుర్తొస్తారు. అయితే ఆ లిస్టులో తప్పక ఉండే పేర్లలో పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పేస్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అక్తర్.
వరల్డ్ క్రికెట్లో ఏ టీమ్ అయినా సరే, బౌలింగ్‌లో ఎక్కువగా పేసర్లకు ప్రాధాన్యం ఇస్తుంది. మ్యాచ్‌లను గెలిపించాలంటే జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లు ఉండాల్సిందే. మంచి వేగం, కచ్చితత్వం, నియంత్రణతో కూడిన బాల్స్‌ను సంధించే పేసర్లను చూస్తే స్టార్ బ్యాటర్లు కూడా తడబడతారు. ఒకప్పుడు భీకరమైన పేస్ బౌలింగ్ అటాక్ కలిగిన జట్లుగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి వాటిని చెప్పేవారు. 1980 నుంచి 1990వ దశకం వరకు పేస్ బౌలింగ్‌కు కరీబియన్ టీమ్ అడ్డాగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం వెస్టిండీస్ జట్టు బౌలింగ్‌లో మునుపటి పస కనిపించడం లేదు. ఆసియా జట్లలో అత్యుత్తమ పేస్ అటాక్ కలిగిన టీమ్స్‌లో పాకిస్థాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎలాగైతే భారత్‌ను బ్యాటింగ్‌కు కార్ఖానాగా పిలుస్తారో.. అలాగే పాక్‌ను బౌలర్లకు కర్మాగారంగా చెబుతారు.
పాకిస్థాన్ నిత్యం నాణ్యమైన పేసర్లను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అందిస్తూ వస్తోంది. దాయాది జట్టు నుంచి వచ్చిన అలాంటి పేసర్లలో ఒకడు షోయబ్ అక్తర్. సంప్రదాయ పేస్ బౌలర్లకు భిన్నమైన బౌలింగ్ శైలితో బాల్స్ సంధించేవాడీ రావల్పిండి ఎక్స్‌ప్రెస్. అతడి పేస్‌ను ఎదుర్కోవాలంటే మహా మహా బ్యాట్స్‌మెన్ కూడా గజగజలాడేవారు. బౌన్సర్లు, యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేయడంలో అక్తర్ సిద్ధహస్తుడు. ఒంటిచేత్తో పాక్‌కు ఎన్నో విజయాలు అందించాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంట్రీ చెబుతూ.. మ్యాచ్‌లకు సంబంధించిన విశ్లేషణ వీడియోలు చేస్తున్నాడు అక్తర్. యూట్యూబ్‌లో అతడి ఛానల్‌కు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాంటి అక్తర్ తాజాగా తన కూతురు అయ్లీన్ షేక్‌తో కలసి దిగిన ఒక ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. అయ్లీన్తో కలసి ఆయన దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న అయ్లీన్ ఫొటోను క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
Shoaib Akhtar uploads picture with his daughter@shoaib100mph #ShoaibAkhtar pic.twitter.com/Cf6p22BzIb
— Cricket Pakistan (@cricketpakcompk) June 15, 2023