ఇండియా-ఇంగ్లండ్.. సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. గురువారం అడిలైడ్ వేదికగా రెండో సెమీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ గాయపడ్డాడు. అతను భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇప్పటికే నిలకడగా రాణించని ఆటగాళ్లతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు.. మలాన్ గాయం పెద్ద దెబ్బే. అయితే.. మలాన్ సెమీస్‌కు అందుబాటులో లేకుంటే అతని స్థానంలో మరో ఆటగాడిని ఇంగ్లండ్ ఆడించనుంది. మలాన్ గాయంతో మ్యాచ్‌కు దూరమవ్వడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే అయినా.. అతని స్థానంలో వచ్చే ఆటగాడు మాత్రం టీమిండియాను కలవరపరుస్తున్నాడు.
గురువారం మ్యాచ్ సమయానికి కల్లా డేవిడ్ మలాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండా ఉంటే.. అతని స్థానంలో ఫిల్ సాల్ట్ ఆడే అవకాశం ఉంది. టీ20ల్లో ఇతను మలాన్ కంటే డేంజరస్‌గా ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు తక్కువ మ్యాచ్‌లే ఆడినా.. మలాన్ కంటే భారీ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ టీ20లు ఆడిన సాల్ట్ 164.33 స్ట్రైక్‌రేట్‌తో 235 పరుగులు చేశాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 88 నాటౌట్. ఈ టీ20 వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 41 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 88 పరుగులు చేసి దుమ్మురేపాడు. సాల్ట్ చెలరేగడంతో పాక్ సెట్ చేసిన 170 పరుగుల టార్గెట్‌ను 14.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఛేదించింది.
ఇలా పాకిస్థాన్ బౌలర్ల భరతం పట్టిన సాల్ట్‌కు మలాన్ గాయం కారణంగా సెమీ ఫైనల్‌లో టీమిండియాతో మ్యాచ్ ఆడే అవకాశం దక్కొచ్చు. అయితే.. సాల్ట్ ఇప్పటి వరకు తక్కువ మ్యాచ్‌లే ఆడినా.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయగలడు. పవర్ హిట్టింగ్‌తో పాటు భాగస్వామ్యలు నిర్మించే సత్తా సాల్ట్‌కు ఉంది. అందుకే మలాన్ స్థానంలో ఫిల్ సాల్ట్ బెస్ట్ రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. పైగా అవసరమైతే.. భారీ భారీ సిక్సులతో సాల్ట్ ఎదురుదాడికి కూడా దిగుతాడు. ఇప్పుడే ఇదే విషయం టీమిండియాను ఆలోచనలో పడేసింది. గాయంతో మలాన్ దూరం అయ్యాడని సంతోష పడే లోపే.. అతని కంటే డేంజరస్ బ్యాటర్ జట్టులోకి వస్తుండటంపై భారత జట్టు ఇది సవాలనే చెప్పాలి.
Phil Salt is ready to go if needed vs India 💪#T20WorldCup pic.twitter.com/2dCZpSOD7G
— England’s Barmy Army (@TheBarmyArmy) November 8, 2022
🚨 BREAKING NEWS: Phil Salt set to replace Dawid Malan and bat at No.3 in the Semi Finals against India 🏏#T20WorldCup #INDvsENG pic.twitter.com/JnnTXNgxSl
— CricketGully (@thecricketgully) November 8, 2022