పాకిస్తాన్ అన్నా.. విరాట్ కోహ్లీ అన్నా.. పడి ఏడ్చే గౌతమ్ గంభీర్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా తన దృష్టిలో గొప్ప క్రికెట్ కాలేడు అన్నట్లుగా మాట్లాడాడు. అవసరం లేని సందర్భంలో విరాట్ పేరును ప్రస్తావించిన గంభీర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు సహా క్రికెట్ ప్రేమికులు కూడా మండిపడుతున్నారు. 2013 ఐపీఎల్ సందర్భంగా గంభీర్- కోహ్లీ గొడవను ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. రాజకీయ నాయకుల తీరు ఇలాగే ఉంటది అంటూ.. దీనికి రాజకీయ రంగు పూసి రచ్చ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీ ఒక్కడే. పాకిస్తాన్‌పై వన్ ఆఫ్ ది కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాదాడు. ఇలా రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన గౌతమ్ గంభీర్ మాత్రం సంతోషంగా లేడు. ఇక్కడ గంభీర్ ప్రేమంతా.. మిస్టర్ ఇండియా 360 సూర్య కుమార్ యాదవ్ పైనే. అతని దృష్టిలో సూర్య గొప్ప క్రికెటర్ అవ్వొచ్చు కానీ, కోహ్లీని విమర్శించడం అభిమానులకు ఏమాత్రం నచ్చట్లేదు. పాక్ తో జరిగిన మ్యాచులో 15 పరుగులకే వెనుదిరిగిన సూర్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు.
— Govardhan Reddy (@gova3555) October 29, 2022
“ప్రస్తుత భారత జట్టులో సూర్య కంటే బెస్ట్ బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీల మాదిరి సూర్య పవర్ ప్లేలో బ్యాటింగ్ రాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వస్తున్నాడు. ఆ సమయంలో ఫీల్డర్లు బౌండరీ దగ్గర ఉంటారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చి బౌండరీలు బాదడం అంటే మామూలు విషయం కాదు. కోహ్లీ, రాహుల్, రోహిత్ అలా ఆడలేరు. అంతేకాదు.. సూర్య వచ్చీ రాగానే బౌండరీలు కొట్టడం వల్ల ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతోంది. అందుకే అతనే బెస్ట్ బ్యాటర్. నెదర్లాండ్స్ మ్యాచులో సూర్య వల్లే కోహ్లీ ఒత్తిడి పోయి, స్వేచ్చగా ఆడగలిగాడు. విరాట్ మంచి ప్లేయరే కావచ్చు కానీ, సూర్య కంటే బెస్ట్ బ్యాటర్ మాత్రం కాదు..” అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, భారత జట్టు ఆదివారం పెర్త్ వేదికగా సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే విజయం సాధిస్తే సెమీస్ అవకాశాలు మరింత పదిలమవుతాయి.
Gautam Gambhir is getting annoying bro..
Dude got hate boner towards Virat Kohli.. pic.twitter.com/vCiQGXrIAX— Hemant (@Hemantitachi) October 27, 2022
Gautam Gambhir: Kohli had to perform today otherwise it would have been difficult for team management to keep him in the playing XI.
You are a CHEAP, JEALOUS AND a VILE MAN Gambhir 😡😡#INDvsPAK2022
— Shubham 🇮🇳 (@shubh_ind) October 23, 2022