శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియా వెళ్లిన గుణతిలక అక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆస్ట్రేలియా పోలీసులు గుణతిలకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్‌ను జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా ఈ రేప్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. దనుష్క గుణతిలకకు ఆ అమ్మాయితో పరిచయం నుంచి.. జరిగిన ఘటన వరకు అన్ని విషయాలు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించారు.
వరల్డ్ కప్ కోసం శ్రీలంక జట్టుతో కలిసి గుణతిలక ఆస్ట్రేలియా వచ్చాడు. టిండర్ అనే సోషల్ డేటింగ్ యాప్‌లో అక్టోబర్ 29న అతనికి రోజ్ బే అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లో చాట్ చేసుకున్నారు. ఈ పరిచయంతో తనను చూసేందుకు తన దగ్గరికి రావాలని ఆ అమ్మాయిని గుణతిలక కోరాడు. కానీ.. అందుకు ఆ అమ్మాయి నిరాకరించింది. ఆ తర్వాత వారిద్దరూ వీడియో కాల్స్ చేసుకున్నారు. మొత్తానికి ఇద్దరూ ఒక చోట కలుసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్నట్లు.. నవంబర్ 2న సిడ్నీలోని సెంటర్ క్వేలో ఓపెరా బార్‌లో కలుసుకున్నారు. బార్‌లో ఇద్దరూ మద్యం కూడా సేవించారు. అరగంట తర్వాత అక్కడి నుంచి ఫ్రాంకీస్ పిజ్జాకు వెళ్లి డిన్నర్ చేశారు.
అక్కడి నుంచి ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లేందుకు సర్కిల్ క్వే వార్ఫ్ నుంచి నడుచుకుంటూ.. కారు కోసం ఎదురుచూశారు. కారు వచ్చేలోపు గుణతిలక ఆ అమ్మాయిని వాటేసుకుని బలవంతంగా పెదాలపై ముద్దుపెట్టాడు. ఆ తర్వాత కారులో కూడా రెండు సార్లు బలవంతంగా పెదాలపై ముద్దు పెట్టి.. తన బ్యాక్‌పై గట్టిగా కొట్టాడు. ఆ అమ్మాయి ఇంటికి చేరుకున్న తర్వాత.. ఆమెను బలవంతంగా సోఫాపై తోసి.. మీదపడిపోయిన గుణతిలక.. ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో అమ్మాయి.. ‘కొంచెం నిదానంగా..’ అని చెప్పడంతో.. ఇద్దరూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు.
అక్కడ కూడా గుణతిలక ఆ అమ్మాయికి ఊపిరి ఆడనివ్వకుండా మీద పడుతుండటంతో.. ఆ అమ్మాయి కండోమ్ ధరించి శృంగారంలో పాల్గొనమని కోరింది. కానీ.. గుణతిలక అందుకు ఇష్టంలేకపోయినా.. సరే అని ప్రొసీడ్ అయ్యాడు. శృంగారంలో పాల్గొంటున్న సమయంలోనే.. బెడ్ పక్కన కండోమ్ పడి ఉండటాన్ని చూసిన ఆ అమ్మాయి.. గుణతిలక కండోమ్ ధరించలేదని తెలిసి షాక్ అయింది. దాంతో అతన్ని మళ్లీ కండోమ్ ధరించమని కోరింది. అందుకు గుణతిలక అంగీకరించకుండా మరింత బలవంతంగా ఆమెతో శృంగారం చేశాడు. దీంతో 29 ఏళ్ల ఆ యువతి షాక్‌కు గురైంది. కొంత సేపటి తర్వాత బట్టలు వేసుకున్న గుణతిలక.. తన కోసం ఉబర్ బుక్ చేయమని ఆ యువతిని కోరగా.. ఆమె బుక్ చేయడంతో.. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుణతిలక తనుండే హోటల్‌కు చేరుకున్నాడు.
ఉదయం నిద్రలోంచి లేచిన యువతి తన గొంతు, పెదాలు వాపుతో ఉండటం గమనించి.. తన స్నేహితులను ఫోన్ చేసి పిలిచి.. డాక్టర్ వద్దకు వెళ్లింది. అలాగే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై గుణతిలక బలవంతం చేశాడని.. తాను కండోమ్ ధరించి, మృదువుగా సెక్స్ చేసేందుకు మాత్రమే అంగీకారం తెలిపినట్లు.. కానీ అతను తనపై బలవంతంగా, కండోమ్ లేకుండా లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను మెడికల్ టెస్టులకు పంపిన పోలీసులు, ఆమె ఇంట్లో వాడిపడేసిన కండోమ్, ఇతర దుస్తులను స్వాధీనం చేసుకుని.. గుణతిలకను అరెస్ట్ చేశారు. సోమవారం తొలి సారి కోర్టు ముందుకు వచ్చిన గుణతిలక బెయిల్ కోరగా కోర్డు నిరాకరించింది. అయితే తొలి హియరింగ్‌లో మీడియాను అనుమతించని కోర్టు.. రెండో హియరింగ్ సమయంలో అనుమతించింది. కోర్టుకు సమర్పించిన డ్యాక్యుమెంట్స్‌లో ఈ విషయాలు వెలుగుచూశాయి. అయితే.. ఈ ఆరోపణలపై గుణతిలక కోర్టు ముందు స్పందిస్తూ.. నేను ఆమె అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నానని, బలవంతంగా చేస్తున్నానని తనకు అనిపించలేదని వెల్లడించాడు. మరీ ఈ కేసులో గుణతిలకకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.
Danushka Gunathilaka pic.twitter.com/CMg2Msqi0j
— RVCJ Media (@RVCJ_FB) November 9, 2022
Media successfully fought a police suppression order today to release these details.
Sydney woman had brain scan after being choked by Sri Lankan cricketer Danushka Gunathilaka, court documents allege https://t.co/J2qXTF5D7w
— Isobel Roe (@isobelroe) November 9, 2022