టీ20 వరల్డ్ కప్ 2022.. ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఓ వైపు ఆటలో సంచలనాలను నమోదు చేస్తు.. మరో వైపు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇన్ని వివాదాల మధ్య ప్రపంచ కప్ టోర్నీకే మచ్చతెచ్చాడు శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక. ఆస్ట్రేలియాలోని రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2 అత్యాచారం చేసినందుకు గాను అదుపులోకి తీసుకున్నట్లు.. సిడ్నీ పోలీసులు తెలిపారు. దాంతో అతడిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ. దనుష్క గుణతిలను తక్షణమే అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
దనుష్క గుణతిలక.. శ్రీలంక క్రికెట్ కే కాక క్రీడాలోకానికి మాయని మచ్చ తెచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడి.. గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాలోనే ఓ హోటల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 2 రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిని అత్యాచారం చేశాడన్న కారణంగా అతడిని సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశాని ఇంతటి కలంకం తెచ్చిన గుణతిలకపై కొరడా ఝుళిపించింది. అతడిని అన్నిక్రికెట్ ఫార్మాట్స్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది శ్రీలంకన్ క్రికెట్ ఎక్స్ క్యూటీవ్ కమిటీ.
JUST IN: Danushka Gunathilaka suspended from all forms of cricket with immediate effect. pic.twitter.com/OU2fyvozFl
— Prasenjit Dey (@CricPrasen) November 7, 2022
ఇక ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఎక్వైరిలో నిజానిజాలు తేలినప్పుడు మరికొన్ని చర్యలు తీసుకుంటామని బోర్డు తెలిపింది. ఈ కేసులో ఆస్ట్రేలియా పోలీసులకు, ఆసిస్ న్యాయస్థానానికి శ్రీలంక బోర్డు అన్ని విధాలుగా సహకరిస్తుందని కూడా తెలిపింది. అయితే 2018లో కూడా గుణతిలక ఇదే తరహా రేప్ కేసును ఎదుర్కొని 6 మ్యాచ్ లు నిషేధించ బడ్డాడు. ఈ క్రమంలోనే శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని క్రీడాభిమానులు, క్రీడానిపుణులు స్వాగతిస్తున్నారు. గుణతిలక విచారణ పూర్తైన తర్వాత అతడు తప్పు చేసినట్లు తెలిస్తే.. అతడిపై క్రీడా నిబంధనల కింద జరిమానాను సైతం విధిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
🚨 NEWS ALERT 🚨
According to reports, Danushka Gunathilaka, who remained with the squad despite being ruled out of the #T20WorldCup with injury, has been reportedly arrested in Sydney for rape.
The Sri Lankan team have left for home leaving him behind. #CricketTwitter pic.twitter.com/HmclYMiLuX
— Sportskeeda (@Sportskeeda) November 6, 2022