2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఓవైపు వరుణుడు, మరోవైపు పసికూనల విజృంభనతో మ్యాచ్ మ్యాచ్ కు కీలక మలుపులు తిరుగుతోంది టోర్నీ. వీటితో పాటుగా వివాదాలు సైతం టోర్నీలో బాగానే జరుగుతున్నాయి. పాక్ తో మ్యాచ్ లో నోబాల్ వివాదం ముగియక ముందే.. ఇదే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ అక్షర్ పటేల్ రనౌట్ వివాదాస్పదంగా మారింది. మరో సారి ఓ రనౌట్ వార్తల్లో నిలిచింది. తాజాగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ దినేష్ కార్తీక్ రనౌట్ వివాదాస్పదంగా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ రనౌట్ వివాదాస్పదంగా మారింది. షోరీఫుల్ ఇస్లామ్ వేసిన 16వ ఓవర్ చివరి బంతిని విరాట్ కోహ్లీ ఎక్స్ ట్రా కవర్ మీదుగా స్ట్రైట్ ఆడాడు. దాంతో అవతలి ఎండ్ లో ఉన్న డీకే లేని పరుగుకు ప్రయత్నించగా.. బంగ్లా కెప్టెన్ బాల్ ను బౌలర్ కు అందించాడు. కానీ ఇస్లామ్ బంతిని పట్టుకుని వికెట్లను కొట్టే క్రమంలో బాల్ అతడి చేతి నుంచి జారింది. దాంతో కాలి చేతులతోనే వికెట్లను తాకాడు ఇస్లామ్. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. బాల్ సైతం భూమికి తాకకుండా బౌలర్ చేతి నుంచే నేరుగా వికెట్లను తాకింది. దాంతో అంపైర్ డీకే ను అవుట్ గా ప్రకటించాడు. ఇక థర్డ్ అంపైర్ సైతం రిప్లేలు చూడకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దాంతో దినేష్ కార్తీక్ పెవిలియన్ కు వెళ్లడం తప్పలేదు.
అయితే కోహ్లీ బాల్ ఫీల్డర్ చేతికి అందింది చూసుకోవాలి కదా దినేష్ అన్నట్లు సైగ చేయగా.. డీకే సైతం చూసుకోవాలి కదా అన్నట్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే అసలు దినేష్ కార్తీక్ ఔటా? నాటౌటా? అనే విషయంలో మాత్రం సందిగ్దం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. అంపైర్లపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా అక్షర్ పటేల్ ని ఇలాగే అవుట్ ఇచ్చారు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి రనౌట్ లపై మరింత కచ్చితంగా నిర్ణయాలు తీసుకునేలా నిబంధనలు సవరించాలని క్రికెట్ ప్రేమికులు కోరుతున్నారు.
@cricketworldcup @ICC @ICCMediaComms @BCCI Third umpire gives third class decision. IndvsBan DK run out issue. Ball hits stumps but Bells clearly dislodged by hands and ball was not in contact with hands as well as stumps… pic.twitter.com/OK9MFvQHyv
— Ajay Khanna (@AAJAY_KHANNA) November 2, 2022