టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసల వర్షం కురిపించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి సారి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో మాట్లాడిన రోజర్ బిన్నీ. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా.. పాకిస్థాన్‌పై విజయం సాధించడంపై సంతోషంగా ఉందన్నారు. అలాగే హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రేట్ సిక్స్ అయితే కలలా ఉందని బిన్నీ అన్నారు. ఈ మ్యాచ్ అద్భుతంగా జరిగిందని.. చివరి వరకు పాకిస్థాన్ చేతుల్లో ఉన్న ఒక్కసారిగా టీమిండియా వైపు తిరిగి.. విజయం మన సొంతం అవ్వడం సూపర్ థ్రిల్లింగ్ అనిపించిందని అన్నారు.
అలాగే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడని.. అతనో గొప్ప బ్యాటర్ అని బిన్నీ కొనియాడారు. విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. అతనో అద్భుతమైన క్లాస్ ప్లేయర్ అని.. ఒత్తిడిలో కోహ్లీ చాలా బాగా ఆడతాడని బిన్నీ అన్నారు. మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉంటే.. కోహ్లీ నుంచి అంత బెస్ట్ బయటికి వస్తుందని అన్నారు. కాగా.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై.. బాధ్యతలు చేపట్టిన బిన్నీ.. టీమిండియా ఆటగాళ్ల గాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
కాగా.. భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 23న జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 82 పరుగుల చేసి టీమిండియా విజయాన్ని అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ వికెట్లు త్వరత్వరగా పడిపోయినా.. పాండ్యాతో కలిసి అద్భుతంగా ఆడడు. 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన రెండు సిక్స్‌లు మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచాయి. అందులో మరీ ముఖ్యంగా స్ట్రేట్ సిక్స్ మాత్రం నభూతో నభిష్యతిః. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది.
👑Kohli essayed one of the greatest knocks against Pakistan 👇#ViratKohli𓃵 #BCCI #INDvsPAK #RogerBinny #T20WorldCup https://t.co/pIUBEYxF8U
— HT Sports (@HTSportsNews) October 29, 2022