టీ20 వరల్డ్ కప్ 2022లో జింబాబ్వే సృష్టించిన సంచలనంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో గెలవాల్సిన మ్యాచ్ ఓడిన పాక్.. రెండో మ్యాచ్‌ల్లో సీనియర్ పసికూన జింబాబ్వే చేతిలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఇది కూడా పాకిస్థాన్ సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్. కేవలం 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో పాక్ చతికిలపడింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా.. జింబాబ్వేపై ఓటమి పాకిస్థాన్ అభిమానులతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమికి పలు కారణాలను వివరిస్తూ.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను ఏకిపారేస్తున్నారు.
ఇప్పటికే పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్థాన్ టీమ్‌పై దారుణ విమర్శలు చేశాడు. అలాగే బాబర్ అజమ్ ఒక చెత్త కెప్టెన్ అంటూ పేర్కొన్నాడు. ఇక తాజాగా మరో దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం పాకిస్థాన్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బాబర్ అజమ్‌పై విమర్శలు గుప్పించాడు. బాబర్ అజమ్‌కు మరింత బుద్ధి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. వసీం అక్రమ్ మాట్లాడుతూ..‘ఒక ఏడాది కాలం నుంచి పాకిస్థాన్ మిడిల్డార్ వీక్‌గా ఉంది. గతంలో యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షోయబ్ మాలిక్‌తో మిడిల్డార్ పటిష్టంగా ఉండేది.
నేను కెప్టెన్‌గా ఉంటే.. నా ఎండ్ గోల్ వరల్డ్ కప్ గెలవడమే అయ్యేది. వరల్డ్ కప్ గెలవడం కోసం చివరి గాడిదను తండ్రిలా భావించాల్సిన వచ్చిన నేను అలానే చేసేవాడిని.. ఎందుకంటే నాకు వరల్డ్ కప్ గెలవడం ముఖ్యం. అలాంటి టైమ్‌లో ఒక ఏడాది నుంచి పాకిస్థాన్ టీమ్‌లో మిడిల్డార్ వీక్ ఉన్న విషయం అందరికీ తెలుసు. అయినా కూడా షోయబ్ మాలిక్‌ను పక్కనపెట్టారు. నేను కెప్టెన్ అయ్యింటే మాలిక్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకునే వాడిని. మిడిల్డార్ పటిష్టంగా ఉండాలంటే మాలిక్ జట్టులో ఉండాలంటే.. సెలెక్టర్ల వద్దకు వెళ్లి మాలిక్ జట్టులో ఉండాలి.. లేదంటే నేను వరల్డ్ కప్ ఆడను. అని కెప్టెన్ బాబర్ ఆడగాల్సింది. అలా చేయాలంటే బాబర్‌కి ఇంకొంత బుద్ధి రావాలి.’ అని వసీం అక్రమ్ అన్నాడు.
The absolute utter nonsense thrown here by the legend Wasim Akram, accusing Babar Azam of selecting his ‘friends’ and doing massive PR stunt for Shoaib Malik. He is saying, Malik should have been selected because it was Australia. Somebody tell him Malik’s stats in Aus. Unreal. pic.twitter.com/2cjxTD02Zj
— Hassan Cheema (@Gotoxytop1) October 28, 2022