క్రికెట్ లో మిస్టర్ 360 అనగానే అందరూ ఏబీ డివిలియర్స్ గురించే మాట్లాడుకుంటారు. కానీ అతడిని మరిపించేలా సూర్యకుమార్ వెలుగులోకి వచ్చాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరూ తన కోసం మాత్రమే మాట్లాడుకునేలా చేశాడు. ఏకంగా ఏబీడీతోనే ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి సూర్య బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసు. కానీ తనలో బ్యాటర్ మాత్రమే కాదు అంతకు మించిన ఫీల్డర్ ఉన్నాడని కూడా ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. న్యూజిలాండ్ తో మూడో టీ20లోనూ అలాంటి సీన్ కనిపించింది.
ఇక విషయానికొస్తే.. అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరిగింది. ఈ నిర్ణయాత్మక మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన మన జట్టు.. ఏకంగా 234 పరుగుల భారీ స్కోరు చేసింది. గిల్ సెంచరీతో చెలరేగడమే కాదు రికార్డులతోనూ అల్లాడించాడు. ఇక ఛేదనలో న్యూజిలాండ్ పూర్తిగా చేతులెత్తేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు అందరూ కూడా వచ్చినవాళ్లు వచ్చినట్లే ఔటై పెవిలియన్ బాటపట్టారు. ఈ మ్యాచులో మన బౌలర్లు, బ్యాటర్లు మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించారు.
మెయిన్ గా చెప్పాలంటే ఇప్పటివరకు బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్.. మూడో టీ20లో మాత్రం ఫీల్డింగ్ తో చెలరేగిపోయాడు. స్లిప్ లో ఉన్న సూర్య.. తొలి ఓవర్ లో ఫిన్ అలెన్, మూడో ఓవర్ లో గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ ని ఒకేలా గాల్లోకి ఎగిరి మరీ ఒడిసిపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు ఫ్యాన్స్ అయితే.. బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ సూర్య ‘మిస్టర్ 360’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదే మ్యాచులో శాంట్నర్ క్యాచ్ కూడా సూర్యనే పట్టడం విశేషం. మరి సూర్య క్యాచుల చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Suryakumar Yadav has taken 2 similar catches at slips – excellent catch. pic.twitter.com/8EWY0uIxKd
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2023
Another stunning slip catch by SKY 😮
🇳🇿- 7/4#INDvNZ pic.twitter.com/UJNiFWzpX6— RAHUL KUMAR SINGH🇮🇳 (@rahulsinghhcu) February 1, 2023